twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడే తొలిసారి.. ఆ త‌ర్వాత పాండిబ‌జార్‌లో.. పెళ్లి చేసుకోరు కానీ: చిరంజీవి కామెంట్స్

    |

    పీపుల్స్ స్టార్ గా ఆర్. నారాయణ మూర్తి ప్రస్థానం చెప్పుకోదగింది. విప్లవ నేపథ్యంలో ఎన్నో సినిమాలతో ప్రేక్షాకులకు మంచి సందేశాలు ఇచ్చారాయన. ఒక సినిమాకు అన్నీ తానై, ప్రతీ బాధ్యతను ఎంతో చాకచక్యంగా నిర్వహించడం ఆయనలోని గ్రేట్ నెస్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ప్రజాస్వామ్యం. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్బంగా నారాయణమూర్తి గురించి చిరంజీవి చాలా ఆసక్తికరంగా మాట్లాడటం విశేషం. వివరాల్లోకెళితే..

    ఆయన నన్నెప్పుడూ పిలవలేదు

    ఆయన నన్నెప్పుడూ పిలవలేదు

    తన సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసినా నారాయ‌ణ‌మూర్తిగారు నన్ను ఎప్పుడూ పిల‌వ‌లేదని, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఆడియో రిలీజ్ కి తనను పిలవడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. నేను అభిమానించే మంచి మిత్రుడు నారాయ‌ణమూర్తి అని ఈ సందర్బంగా చిరు అన్నారు.

    నారాయ‌ణమూర్తిది ప్యూర్ హార్ట్‌

    నారాయ‌ణమూర్తిది ప్యూర్ హార్ట్‌

    ఆర్ నారాయ‌ణమూర్తిని ఆకాశానికెత్తుతూ మెగాస్టార్ మాట్లాడటం విశేషం. నారాయ‌ణమూర్తిది స్వచ్ఛమైన హృదయమని చిరు అన్నారు. 1978లో తాను `ప్రాణం ఖ‌రీదు` సినిమా చేస్తున్న‌ప్పుడు నూత‌న్ ప్ర‌సాద్‌కి పేప‌ర్ అందించే కుర్రాడిగా ఆయన నటించారని ఈ సందర్బంగా చిరు గుర్తుచేసుకున్నారు.

    నారాయణమూర్తి ఓ యోగి.. సినిమాతోనే సంసారం.. పూరీకే ఝలక్ ఇచ్చాడు.. చిరంజీవినారాయణమూర్తి ఓ యోగి.. సినిమాతోనే సంసారం.. పూరీకే ఝలక్ ఇచ్చాడు.. చిరంజీవి

    మొదటిసారి అక్కడే కలిసాం..

    మొదటిసారి అక్కడే కలిసాం..

    ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిని మొదటిసారి `ప్రాణం ఖ‌రీదు` సినిమా చేస్తున్నప్పుడే కలిశా. ఆ త‌ర్వాత మెమ్మేమిద్దరం పాండిబ‌జార్‌లో అప్పుడ‌ప్పుడూ క‌లిసి మాట్లాడుకునేవాళ్లం. అప్పటి నుంచి మా మ‌ధ్య స్నేహం ఉంది. అప్ప‌టి నారాయ‌ణ‌మూర్తి ఎప్పుడెలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మ‌నిషి ఎంత ఎదిగినా, ఎంత సాధించినా స‌రే, ఆయ‌న మాన‌సికంగా మార‌లేదు అని చిరు అన్నారు.

    ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం

    ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం

    నారాయ‌ణ‌మూర్తి సినిమాల‌ను విప‌రీతంగా ప్రేమిస్తాడు. ఆయన ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం ఆయన పడిన కష్టమేనని చిరు పేర్కొన్నారు. ఆయ‌న దీక్ష‌, ప‌ట్టుద‌ల స్ఫూర్తివంత‌మైన‌వి. కమ్యూనిజం భావ‌జాలంతో సినిమాలు చేశాడు. ఇన్నేళ్లు అదే క‌మిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. సినిమాల్లో ఎవ‌రైనా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల వైపు ఆక‌ర్షితుల‌వుతారు. కానీ టెంప‌ర్ సినిమాలో మంచి పాత్ర‌ను ఇచ్చిన నో చెప్పాడంటే అదే నారాయ‌ణ‌మూర్తి. ఇలాంటి వ్య‌క్తులు సినిమా ఇండ‌స్ట్రీలో వెతికినా దొర‌క‌డు. చాలా అరుదైన వ్య‌క్తి. సినిమానే ఆయ‌న పెళ్లి చేసుకున్నారు. సినిమాల‌తోనే ఆయ‌న జీవిస్తున్నారు అని చిరంజీవి ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు.

    English summary
    In Prajaswamyam Audio launch Chiranjeevi speech is very ataractive. He spoke about R. Narayana Murthy skills and their relationship
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X