ఎన్నోసార్లు అడిగినా వెళ్లలేదు.. చాలా బాధగా ఉంది: జయప్రకాష్ మృతిపై మెగాస్టార్, రాజమౌళి ఎమోషనల్
సీనియర్ నటుడు జయప్రకాష్ మృతి చెందడం ఒక్కసారిగా టాలీవుడ్ ప్రముఖులను షాక్ కి గురి చేసింది. ఉదయాన్నే ఆయన మరణవార్త వినడం ఎంతో బాధగా ఉందని ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, శ్రీను వైట్ల వంటి వారు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతిపై స్పందిస్తూ గొప్ప నటుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు.

మా కాంబినేషన్ గొప్పగా ఉంటుంది
నా ప్రియమైన స్నేహితుడు జయప్రకాశ్రెడ్డి గారు ఆకస్మిక మరణం గురించి విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మా ఇద్దరి కాంబినేషన్ వెండి తెరపై చాలా గోప్పగా ఉంటుంది. ఖచ్చితంగా అతనిని మిస్ అవుతున్నట్లు వెంకటేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వెంకటేష్ తో జయప్రకాష్ జయమనదేరా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
సీనియర్ నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి మృతి సినీమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయనతో నేను ఖైదీ నెంబర్ 150సినిమాలో చివారిసారిగా నటించాను. ఆయన ఒక గొప్ప నటుడు. "నాటకరంగం నన్ను కన్నతల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి" అనేవారు. అందుకే శని ఆదివారాల్లో షూటింగ్స్ పెట్టుకోకుండా స్టేజ్ మీద పెర్ఫామెన్స్ ఇస్తుంటానని అనేవారు. అలాగే నన్ను కూడా రమ్మనేవారు.

ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను
ఆయన స్టేజ్ షోలు చూసే ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే మొదట గుర్తుకు వచ్చేది జయప్రకాష్ రెడ్డి గారు మాత్రమే. తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అని మెగాస్టార్ చిరంజీవి వివరణ ఎచ్చరి.

రాజమౌళి ట్వీట్
జయప్రకాష్‌రెడ్డి గారి ఆకస్మిక మరణం గురించి తెలిసి షాక్ అయ్యారు. అతనితో కలిసి పనిచేయడానికి ఒక గొప్ప అనుభూతి. మంచి టైమింగ్ ఉన్న నటులు. దశాబ్దాలుగా కొన్ని చిరస్మరణీయ కామెడీ, విలన్ పాత్రతో మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రాజమౌళి ట్వీట్ చేశారు.
Recommended Video

ఎప్పటికి మరచిపోలేను: శ్రీను వైట్ల
నా ప్రియమైన అంకుల్, నా కెరీర్ ప్రారంభం నుండి నేను మీకు తెలుసు, మీరు నా పట్ల కలిగి ఉన్న స్వేచ్ఛ, ప్రేమలను నేను ఎన్నటికి మర్చిపోలేను. ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలలో నేను మిమ్మల్ని గుర్తుచేసుకుంటూ ఉంటాను. మీరు ప్రతి సన్నివేశాన్ని మీ ఉత్సాహంతో నింపారు. మేము ఇక్కడే ఉంటాము. మేము సినిమాలకు చెందినవాళ్ళం. ఇది మీ ఆశీర్వాదంగా ఎప్పుడూ నాతోనే ఉంటుంది. మిమ్మల్ని నా లైఫ్ లో కలుసుకున్నందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఇక వారి కుటుంబానికి నా ప్రగాడ సంతాపం.. అంటూ శ్రీను వైట్ల పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











