ఒకే సమయంలో స్టాలిన్, బాస్?
చిరంజీవి స్టాలిన్, నాగార్జున బాస్ ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న స్టాలిన్ షూటింగ్ కొన్ని పాటలు మినహా పూర్తయింది. ఈ సినిమా ఆడియో ఆగస్టులో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. నాగార్జున బాస్ ఆడియో కూడా ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ రెండు సినిమాలూ సెప్టెంబర్‌లోనే విడుదల కావచ్చు. స్టాలిన్ షూటింగ్ ఈనెల 21 నుంచి 23 వరకు పాండిచ్ఛేరిలో జరిగింది. కొన్ని ఫైట్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఈనెల 26న ప్రారంభమైన చివరి షెడ్యూల్ ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications