హైద్రాబాద్‌లో ఈ వారం స్టాలిన్ షూటింగ్
చిరంజీవి-మురుగదాస్‌ల ప్రతిష్టాత్మక చిత్రం స్టాలిన్ హైదరాబాద్ షెడ్యూలు రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ సినిమాలోని రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తోంది. సెట్స్‌లోనూ బయటా చిరంజీవి ప్రవర్తనను, క్రమశిక్షణను త్రిష తెగ పొగిడేస్తోంది. కాగా ఈ సినిమాలో ఐటం సాంగ్‌లో నటిస్తుందని భావించిన నయనతార చెయ్యి ఇచ్చినట్టే కనిపిస్తోంది. తమిళంలో ఒక సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి అంగీకరించిన నయనతార స్టాలిన్‌లో ఎందుకు నటించడం లేదో అర్ధం కావడం లేదు. చిరంజీవితో ఆమెకు పరిచయం లేనప్పటికీ దర్శకుడు మురుగదాస్ అంటే ఆమె ఎంతో గౌరవం ఉంది. ఆమెను ఐటం సాంగ్‌కు ఒప్పించగలనని మొదట్లో ఎంతో విశ్వాసంతో ఉన్న మురుగదాస్ ఆ తర్వాత ఎందుకో ఆశలు వదులుకున్నారు. రెమ్యూనరేషనే సమస్యగా మారిందని టాలీవుడ్ వర్గాల కథనం.


Click it and Unblock the Notifications