చెన్నై చేరుకున్న స్టాలిన్ షూటింగ్ దాదాపు పూర్తి
చిరంజీవి, మురుగదాస్‌ల స్టాలిన్ ఫైనల్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని పాత బిన్నీ మిల్స్ కాంప్లెక్స్‌లో జరుగుతోంది. జులై 22 వరకు జరిగే ఈ షెడ్యూలుతో టాకీ పోర్షన్ పూర్తవుతుందని దర్శకుడు మురుగదాస్ చెప్పారు. మూడు పాటలను చిత్రీకరించవలసి ఉందని, ఒక ఐటం సాంగ్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు. పాటలను వివిధ లొకేషన్లలో చిత్రీకరిస్తామన్నారు. ప్రస్తుతం సైనికుడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న త్రిష స్టాలిన్ పాటల షెడ్యూలుకు హాజరు కానుంది. ఈ సినిమా ఆడియో చిరంజీవి పుట్టినరోజున విడుదల కానుంది. సెప్టెంబర్‌లో సినిమా విడుదల కానుంది. స్టాలిన్ సినిమాలో రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక సేవాకార్యక్రమాలపై ఒక పాట ఉంటుంది. ఇటువంటి సేవాకార్యక్రమాల మీద ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో చిరంజీవి పట్టుబట్టి ఈ పాట రాయించారు.


Click it and Unblock the Notifications