బంగారు కోడిపెట్ట అంటూ అలనాటి తారలతో చిరు స్టెప్పులు.. వీడియో వైరల్

Recommended Video

బంగారు కోడిపెట్ట అంటూ అలనాటి తారలతో చిరు స్టెప్పులు.. వీడియో వైరల్

వయసు అనేది ఒక నంబర్ మాత్రమే.. మనిషి ఆలోచనలకు, మనసుకు కాదని అందరూ అంటుంటారు. ఈ విషయాన్ని ఎంతో మంది సెలెబ్రిటీలు నిజం చేసి చూపించారు. ఇంకా చూపిస్తూనే ఉంటారు. ఆరు పదుల వయసు దాటుతున్నా.. యుక్త వయసు కుర్రాడిలా చిందులేస్తుంటారు. వయసుకు మించి కష్టపడుతూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఉంటారు.తాజాగా చిరు వేసిన స్టెప్పులు ముప్పై యేళ్లు వెనక్కి తీసుకెళ్లింది.

ఎయిటీస్ గ్రూప్ అంటూ..

ఎయిటీస్ గ్రూప్ అంటూ..

ప్రతీ ఏడాది నాటి తరం హీరో హీరోయిన్లందరూ ఒక చోట చేరి సెలబ్రేట్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. 80ల కాలం నాటి స్టార్లందరూ ఎయిటీస్ అంటూ గ్రూప్‌గా మారి.. ప్రతీ ఏడాది ఒక చోట కలుసుకుని రెండు మూడు రోజులు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆ వేడుకకు హైద్రాబాద్ కేంద్ర బిందువైంది. అదీ మెగాస్టార్ చిరంజీవి కొత్తింట్లో. ఇక అక్కడ సందడి మామూలుగా లేదని తెలుస్తోంది.

హాజరైన స్టార్లు..

హాజరైన స్టార్లు..

ఈ వేడుకలకు సౌత్, నార్త్ అని తేడా లేకుండా స్టార్లందరూ హాజరయ్యారు. భానుచందర్, నాగార్జున, అమల, వెంకటేష్, కుష్బూ, సుహాసిని, రాధికా, శరత్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, జయసుధ, జయప్రద లాంటి వారంతా హాజరై ఫుల్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వేడుకల నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వైరల్‌గా మారిన రామ్ చరణ్ పిక్స్..

వైరల్‌గా మారిన రామ్ చరణ్ పిక్స్..

ఎయిటీస్.. అంటూ రచ్చ చేస్తోన్న నాటి స్టార్ల మధ్య రామ్ చరణ్ సందడి చేశాడు. వీరందరితో రామ్ చరణ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉండటంతో అందరితో కలిసి సరదాగా గడిపినట్టు తెలుస్తోంది. అప్పట్లో షూటింగ్‌లకు రామ్ చరణ్‌ను తీసుకెళ్లడంతో ఈ వేడుకలో స్టార్లందరితో కలిసిపోయాడు.

మోహన్‌లాల్‌తో పిక్ వైరల్..

మోహన్‌లాల్‌తో పిక్ వైరల్..

రామ్ చరణ్, మోహన్ లాల్, చిరంజీవి పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ప్రత్యేకంగా మోహన్ లాల్, రామ్ చరణ్ దిగిన ఫోటో.. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుండటంతో ఆ పిక్ తెగ హల్ చల్ చేసింది.

తాజాగా చిరు వీడియో వైరల్..

ఇండియన్ మూవీ హిస్టరీలో డ్యాన్సులంటే అందరికీ గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవినే. బిగ్ బీ అమితాబ్ కూడా ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇక డ్యాన్సులంటే చిరుకు ఎంత ప్రాణమో.. చిరు స్టెప్పులంటే అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఎయిటీస్ వేడుకలో చిరు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కుష్బూ, జయప్రదలతో డ్యాన్సులు..

కుష్బూ, జయప్రదలతో డ్యాన్సులు..

బంగారు కోడిపెట్ట అంటూ నాటి స్టెప్పులు చిరు రిపీట్ చేశాడు. అది కూడా అలనాటి అందాల తారలు కుష్బూ, జయప్రదలతో స్టెప్పులు వేయగా.. చిరు తన మ్యానరిజంతో అదరగొట్టేశాడు. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X