బాలయ్య అనుభవం ఉన్న నటుడంటూ వత్తాసు పలికిన చిరంజీవి...!?
ఎన్నడూలేని విధంగా ఇటీవల శ్రీరామ రాజ్యం" ఆడియో సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చాలా ఆవేశంగా మాట్లాడాడు. ముఖ్యంగా ఓ యువ హీరోని ఉద్దేశించి ఆగ్రహంగా మాట్లాడటం చర్చనీయాంశమయ్యింది. తెలుగు రంగాన్ని, తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడితే పళ్లు రాలగొడతానని ఆ యువహీరో పేరు చెప్పకుండా తిట్టాడు బాలయ్య .'సెవెన్త్ సెన్స్" ఆడియో వేడుకలో మురుగదాస్ ని సూర్యని రామ్ చరణ్ విపరీతంగా పొగిడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బాలయ్య అలా అన్నాడనే వార్త ప్రచరాం అవుతోంది.
బాలయ్య మాటలకు మీ స్పందన ఏంటి?అని మీడియావారు చిరంజీవిని కోరగా 'బాలయ్య అనుభవం ఉన్న నటుడు. ఆ అనుభవంతోనే మాట్లాడి ఉంటాడు. అతని మాటలు సబబే" అంత అని సమర్ధించాడు. చిరంజీవి ఇలా అనడానికి కారణం లేకపోలేదు. బాలయ్య మాట్లాడిన మాటలు అక్షరాల నిజమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలో అతందుకు రివర్స్ గా సమాదానం చెప్పి వివాదాల్లో ఇరుక్కుకోవడం ఎందుకూ అని భావించే చిరంజీవి ఈ విధంగా స్పందించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











