స్వచ్ఛ భారత్ మిషన్‌కు చిరంజీవి మద్దతు (వీడియో)
హైదరాబాద్: మన దేశాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో భాగంగం కావాల్సిందిగా నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

ఇప్పటికే ప్రముఖ సినీ స్టార్స్ కమల్ హాసన్, అమీర్ ఖాన్, సూర్య వంటి వారు ఈ స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు తమ మద్దతు ప్రకటించగా....ఇపుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు చిరంజీవి ఓ వీడియో విడుదల చేసారు. శుభ్రతగా ఉండటం దైవభక్తితో సమానం. మనం శుభ్రత పాటించకపోతే భగవంతుని ఆశీసులు లభించవని గాంధీజీ అన్నారు. గాంధీజీ స్ఫూర్తితో ప్రధాని స్వచ్చ భారత్ కి పిలుపునిచ్చారంటూ ఆ వీడియో చిరంజీవి తెలియజేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











