twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉప్పెన బ్లాక్ బస్టర్.. మెగాస్టార్ ‘చిరు’ కానుక.. గాల్లో తేలిపోతోన్న వైష్ణవ్ తేజ్

    |

    మెగాస్టార్ చిరంజీవికి ఓ అలవాటు ఉంది. విదేశాలకు వెళ్లిన ప్రతీసారి చిన్నపిల్లలకు ఏదైనా బహుమతులను తెస్తుంటారు. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే గిఫ్ట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. అలా ప్రోత్సహించే క్రమంలో ఏదో ఒక వస్తువును ఇస్తుంటారు. తాజాగా వైష్ణవ్ తేజ్‌కు కూడా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అది చూసిన వైష్ణవ్ తెగ సంబరపడిపోయినట్టు కనిపిస్తోంది. ఉప్పెనతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేసిన వైష్ణవ్ తేజ్‌కు ఇలా చిరు కానుక ఇచ్చినట్టు తెలుస్తోంది.

    ఉప్పెనతో రికార్డులు..

    ఉప్పెనతో రికార్డులు..

    ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. డెబ్యూ హీరోకు ఈ రేంజ్ కలెక్షన్లు రావడం అన్నది అంత సులభం కాదు. బాలీవుడ్ రికార్డులను సైతం వైష్ణవ్ తేజ్ కొల్లగొట్టేశాడు. ఈ లెక్కన రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల రికార్డ్‌ను కూడా బద్దలు కొట్టేశాడు.

    వంద కోట్ల వసూళ్లు..

    వంద కోట్ల వసూళ్లు..

    ఉప్పెన సినిమా వంద కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. పోటీలో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కరోనాను లెక్కచేయకుండా కూడా ప్రేక్షకులు ఉప్పెనపై ప్రేమను కురిపించారు. అయితే కలెక్షన్లలో కొన్ని వివాదాలు వచ్చినా కూడా ఉప్పెన రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తూనే వస్తోంది.

    మెగా హీరోలు సైతం..

    మెగా హీరోలు సైతం..

    ఉప్పెన సినిమాపై మెగా హీరోల రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి దగ్గరి నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్.. రీసెంట్‌గా అల్లు అర్జున్ సైతం ఉప్పెనపై ప్రశంసలు కురిపించారు. మొదటిసారిగా ఓ మెగా హీరో సినిమాపై నందమూరి బాలకృష్ణ కూడా స్పందించాడు. బుచ్చిబాబును బాలయ్య ప్రశంసలతో ముంచెత్తాడు.

     ప్రస్తుతం అలా..

    ప్రస్తుతం అలా..

    అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ సాధించిన విజయానికి, కొల్లగొడుతోన్న రికార్డులకు సంబరపడుతోన్న చిరంజీవి ఇలా ఓ చిరు కానుకగా ఇచ్చినట్టున్నాడు. చిరంజీవి ఇచ్చిన ఆ గడియారాన్ని చూపుతూ వైష్ణవ్ తేజ్ తెగ మురిసిపోయాడు. థ్యాంక్యూ మామయ్య అంటూ ఓ పోస్ట్ పెట్టేశాడు.

    చిరు ఆచార్య..

    చిరు ఆచార్య..

    ప్రస్తుతం చిరంజీవి ఆచార్య ఖమ్మం షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు. మరో వైపు వైష్ణవ్ తేజ్ క్రిష్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రెడీగా ఉన్నాడు. ఇక ఈ మెగా హీరో తన రెండో సినిమాతో రచ్చ చేసేందుకు సిద్దమవుతున్నాడు. మరో వైపు ఆచార్యతో చిరంజీవి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

    English summary
    Chiranjeevi Surprise Gift To Panja Vaisshnav tej,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X