twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    4500 మంది డ్యాన్సర్లు, 14 రోజులు.. సైరాలో అదే అదిరిపోయే ఘట్టం

    |

    మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా సైరా. తొలి స్వతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సైరా చిత్రాన్ని భారీ బడ్జెట్తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

    గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..

    గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..

    విజువల్ వండర్గా చిత్రీకరించిన సైరాలో.. ఎంతో మంది గొప్ప నటులు గొప్ప గొప్ప పాత్రలను పోషించారు. అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో అత్యంత భారీ ఎత్తున తెరకక్కించారు. రీసెంట్గా ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, వివి వినాయక్, కొరటాల శివ, రాజమౌళిలాంటి దిగ్గజాలు అతిథులుగా విచ్చేశారు.

    వైరల్ అవుతున్న టైటిల్ సాంగ్

    వైరల్ అవుతున్న టైటిల్ సాంగ్

    ఒకప్పటి కాలానికి మనల్ని తీసుకుపోయేందుకు.. సైరా చిత్రయూనిట్ భారీగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. యుద్ద సన్నివేశాలకు ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఉన్నవే మూడు పాటలని సమాచారం. అందులో ఒకటి సైరా టైటిల్ సాంగ్.. అది ప్రీ రీలిజ్ ఈవెంట్ నాడు రిలీజ్ చేశారు. అది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిత్రయూనిట్ మరో విషయాన్ని ప్రకటించారు.

    4600 డ్యాన్సర్లతో.. 14 రోజుల పాటు షూటింగ్

    4600 డ్యాన్సర్లతో.. 14 రోజుల పాటు షూటింగ్

    ఈ చిత్రంలోని జాతర సాంగ్కు ప్రత్యేక స్థానం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ పాట చిత్రీకరణకు వీరు పడ్డ కష్టం మామూలుది కాదని అర్థమవుతోంది. 4600 మంది డ్యాన్సర్లతో.. 14 రోజుల పాటు ఈ పాటను షూట్ చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అంత మందితో అన్ని రోజుల పాటు ఒక్క పాటను షూట్ చేశారంటే.. దానికి ఎంత ప్రత్యేకత ఉందో ఇట్టే తెలిసిపోతోంది. మరి ఈ విజువల్ వండర్ను తెరపై కచ్చితంగా చూడాల్సిందేనని అనిపిస్తోంది. అలాగే 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్లతో 35 రోజుల పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసిన సంగతి తెలిసిందే.

     సెన్సార్ కార్యక్రమాలు పూర్తి...

    సెన్సార్ కార్యక్రమాలు పూర్తి...

    ఈ మూవీ ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. రెండు గంటల యాభై నిమిషాల నిడివితో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్ గా పనిచేశారు. అమిత్ త్రివేది సంగీతం అందించాడు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది

    English summary
    Megastar Chiranjeevis Sye raa Movie Has Some Records That Jathara Song Shoot By 4500 dancers In 14 days. Which Is Produced by ram charan directed by surender reddy. this movie releasing on October 2nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X