twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల వేళ ఇండియాకు దూరంగా మెగాస్టార్ చిరంజీవి?

    |

    2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి 2009లో జరిగిన ఎన్నికల్లో విస్త్రృంగా ప్రచారం చేసి తన పార్టీకి 18 అసెంబ్లీ స్థానాలతోపాటు 18శాతం ఓటు షేర్ సాధించుకున్నారు. తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా ప్రజారాజ్యం పార్టీని 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

    దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటుతో పాటు యూపీఏ ప్రభుత్వంలో టూరిజం మంత్రి పదవి దక్కింది. అయితే 2014లో యూపీఏ నేతృత్వంలో ఏపీ-తెలంగాణ విభజన జరుగడంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చిత్తుగా ఓడిపోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి తన ఫోకస్ మొత్తం సినిమా కెరీర్ మీద పెట్టారు.

    రాజకీయాలకు దూరంగా చిరంజీవి

    రాజకీయాలకు దూరంగా చిరంజీవి

    చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఈ ఎన్నికల్లో జనసేన పార్టీని విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో మరో సోదరుడు నాగబాబు కూడా పార్టీలో చేరారు. అయితే గతంలో రాజకీయాల్లో ఎదురైన చేదు అనుభవాలతో చిరంజీవి పాలిటిక్స్‌కు వీలైనంత దూరంగా ఉంటున్నారు.

    మెగాస్టార్ కొత్త లుక్.. ఫోటో షూట్ చేసిన కొరటాల శివ!మెగాస్టార్ కొత్త లుక్.. ఫోటో షూట్ చేసిన కొరటాల శివ!

    ఎన్నికల వేళ చిరంజీవి ఇండియాలో ఉండటం లేదు

    ఎన్నికల వేళ చిరంజీవి ఇండియాలో ఉండటం లేదు

    ఈ ఎన్నికల సమయంలో చిరంజీవి తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ తరుపున ప్రచారం చేస్తారని ఆ మధ్య ఊహాగానాలకు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. అంతే కాదు... ఈ ఎన్నికల సమయంలో చిరంజీవి అసలు ఇండియాలోనే ఉండటం లేదట.

    సైరా షూటింగ్ కోసం జపాన్ వెళుతున్న చిరు

    సైరా షూటింగ్ కోసం జపాన్ వెళుతున్న చిరు

    ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నా మెగాస్టార్ షూటింగులో భాగంగా జపాన్ వెళుతున్నట్లు సమాచారం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సీన్లు చిత్రీకరించబోన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ‘సైరా' టీమ్ జపాన్ వెళుతున్నట్లు సమాచారం.

    సైరా నరసింహారెడ్డి

    సైరా నరసింహారెడ్డి

    స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది దసరా సంరద్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Chiranjeevi will not be campaigning for his brothers. He will completely stay away from Jana Sena. Source said that, Chiranjeevi to Leave for Japan During Polls. Chiranjeevi and Sye Raa Narasimha Reddy team are planning to leave for Japan to film some key sequences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X