'నా బార్య ఎంత తెలివైందో !' అంటూ చిరంజీవి జోక్
'మీ డ్రెస్ ఎంపికలో భార్య ప్రమేయం ఉంటుందా?' అని రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో చిరంజీవిని ప్రశ్నిస్తే "నన్ను సెలెక్ట్ చేసుకుంది. అంటే ఎంత తెలివైందో తెలుసు కదా" అంటూ జోక్ చేసి నవ్వేశారు. అలాగే...నా డ్రెస్ లను నేనే ఎంపిక చేసుకొంటాను. ఇక నా భార్య సురేఖ చీరల సంగతి అంటారా...అమ్మో..! వాటి జోలికి అసలు వెళ్లను అన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఓ డిజైనర్ స్టూడియో ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పుడు ఈ విధంగా ఫన్నీగా మాట్లాడారు. ఇక తన 150వ చిత్రం గురించి ఇలా చెప్పుకొచ్చారు..."ఇంద్ర, స్టాలిన్, ఠాగూర్ చిత్రాల్లో లాగానే రాబోయే సినిమాలోనూ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, సందేశం, సెంటిమెంట్...అన్నీ కలిపే స్క్రిప్టు తయారవుతుంది. సగటు ప్రేక్షకులు నా నుంచి ఏం ఆశిస్తారో అది తప్పకుండా అందిస్తాను. వారి ఆలోచనల్ని, ఎక్సపెక్టేషన్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను" అన్నారు చిరంజీవి. ఇక సినిమాలో నటించే సన్నాహాల్లో ఉన్న ఆయన అందుకోసమే స్లిమ్ అయ్యారు. అలాగే ఆయన హీరోగా చేసే చిత్రానికి అధినాయుకుడు అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఠాగూర్ మధు ఈ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, వివి వినాయిక్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్శ్ స్క్రిప్టు అందించనున్నారని అంతటా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











