నా రీ ఎంట్రీ సినిమా ఎలా ఉంటుందంటే...చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీకి ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఆయన రీసెంట్ గా మీడియా వద్ద ప్రస్దావిస్దూ...నేను చేయబోయే తదుపరి చిత్రం టిపికల్ మాస్ ఫిల్మ్ లా ఉంటుంది. ఠాగూర్,స్టాలిన్ తరహా కథ, కథనంతో ఉంటుంది. అయితే స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పక్కా కమర్షియల్ సినిమా అది అన్నారు. అయితే ఇప్పటికే ఈ మేరకు పరుచూరి బ్రదర్శ్ కథ రెడీ చేసారని, దర్శకుడుగా ఎవరనేది ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, వచ్చే లాభాల్ని ప్రజా సంక్షేమానికి ఖర్చుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రం అటు రాజకీయంగా ఊపుతెచ్చేటట్లు, తిరిగి తన అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగానూ ఉండాలని చిరంజీవి పదే పదే చెప్తూ కథ రెడీ చేయిస్తున్నారట. అయితే కేవలం సందేశమే అయితే అది డాక్యుమెంటరీలా తయారవుతుందని, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండాలని అల్లు అరవింద్ కూడా సలహాలిస్తున్నారట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











