For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi Corona Positive: మరోసారి కరోనా బారిన పడ్డ మెగాస్టార్.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!

  |

  రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఈ వైరస్ ధాటికి వణికిపోతోంది. ఇప్పటికే రెండు దశల కారణంగా ఎంతో మందిపై ప్రభావం పడిపోయింది. ఇక, ఈ మధ్య మొదలైన మూడో దశలో ఇది మరింత వేగంగా విస్థరిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులంతా ఈ వైరస్ బారిన పడుతున్నారు.

  ఇలా ఇప్పటికే చాలా మందికి ఇది సోకింది. ఇక, తాజాగా టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్వయంగా వెల్లడించారు. అలాగే, తన ఆరోగ్య పరిస్థితిని కూడా అందులో తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  ఎక్కువ మందికి కరోనా పాజిటివ్

  ఎక్కువ మందికి కరోనా పాజిటివ్

  గతంతో పోలిస్తే ఈ సారి తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కరోనా వైరస్ విస్తృతంగా సోకుతోంది. ఇప్పటికే మహేశ్ బాబు, రాజేంద్ర ప్రసాద్, థమన్ సహా ఎంతో మంది సీనియర్, కుర్ర హీరోలకు కోవిడ్ సోకింది. అంతేకాదు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు సహా చాలా మంది టెక్నీషియన్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వాళ్లంతా క్రమంగా కోలుకుంటున్నారు.

  Bigg Boss OTT: షోలోకి ఫేమస్ హీరోయిన్ ఎంట్రీ.. ఈమెకు మాత్రమే అంత రెమ్యూనరేషన్‌కు డీల్

  కరోనా బారిన పడ్డ హీరో చిరంజీవి

  కరోనా బారిన పడ్డ హీరో చిరంజీవి

  కొంత కాలంగా టాలీవుడ్‌పై కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోన్న విషయం తెలిసిందే. అందుకే చాలా మంది ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గతంలో కూడా ఈ సీనియర్ హీరోకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి విధితమే.

  జాగ్రత్తలు తీసుకున్నా వచ్చింది

  జాగ్రత్తలు తీసుకున్నా వచ్చింది

  తనకు కరోనా సోకిన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ‘డియర్ ఆల్.. గత రాత్రి చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు ఈ వైరస్ సోకింది' అంటూ పేర్కొన్నారు. దీంతో మెగా అభిమానులు, సినీ ప్రియులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

  షణ్ముఖ్ జస్వత్ ప్రపంచ రికార్డు: టాప్ 10లో రెండు స్థానాలు.. వామ్మో మనోడి క్రేజ్‌ ఈ రేంజ్‌లోనా!

  ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే

  ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే


  రెండోసారి కరోనా బారిన పడిన చిరంజీవి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తాజాగా చేసిన ట్వీట్‌లో ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చినా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను' అని వివరించారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు స్నేహితులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

  వాళ్లందరూ టెస్ట్ చేయించాలని

  వాళ్లందరూ టెస్ట్ చేయించాలని

  తనకు కరోనా సోకినట్లు వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా చేసిన ట్వీట్‌లో ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో.. గత కొన్ని రోజుల్లో నన్ను కలిసి వాళ్లందరూ టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ రిక్వెస్ట్ చేశారు. చిరంజీవి కోవిడ్ బారిన పడడంతో ఆయన కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.

  ఓవర్ డోస్ హాట్ షోతో రెచ్చిపోయిన మలైకా: 48 ఏళ్ల వయసులో మరీ ఇంత ఘోరంగానా!

  Acharya Movie Story Based On A Great Book, Here Is the Details | Filmibeat Telugu
  ఆ మూవీ షూట్‌లో పాల్గొన్న చిరు

  ఆ మూవీ షూట్‌లో పాల్గొన్న చిరు

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ తెరకెక్కిస్తోన్న ‘భోళా శంకర్' మూవీలో నటిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కీర్తి సురేష్ కూడా అందులో భాగం అయింది. ఇదిలా ఉండగా.. చిరంజీవి కొద్ది రోజులుగా పలు సినిమా కార్యక్రమాల్లో సైతం పాల్గొంటున్న విషయం తెలిసిందే.

  English summary
  Megastar Chiranjeevi Tested Positive for Covid-19 with Mild symptoms last night. Now He quarantining at His home.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion