twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా పరిశ్రమ కోలుకునేందుకు నిర్ణయాలు.. సీఎం జగన్‌కు చిరు ధన్యవాదాలు

    |

    సినీ పరిశ్రమ అభివృద్ది, కరోనా వైరస్ వల్ల దెబ్బ తిన్న చిత్రసీమను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. ఈ మేరకు నేడు సినీ పెద్దలందరూ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇప్పటికే షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మరికొన్ని తాయిలాలను ప్రకటించింది. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

    తెలుగు సినీ పరిశ్రమ ఏపిలో రాణించటానికి సిఎం జగన్ ప్రత్యేకమైన జివో రిలీజ్ చేశారు. నంది అవార్డులపై కూడా సిఎం జగన్ తో చర్చించారు. 2019-2020 నంది అవార్డుల వేడుక కూడా త్వరలో జరగనుంది. తెలంగాణాతో పాటు ఏపిలో కూడా జూన్ 15 నుండి షూటింగ్ జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు సోషల్ మీడియా వేదికగా చిరు ధన్యవాదాలు తెలిపారు.

    Chiranjeevi Thanks To CM YS Jagan For Tollywood To encourage In AP

    చిరు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ..' సినిమా పరిశ్రమ కోలుకునేందుకు అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకుంటానని సానుకూలంగా స్పందించిన ఏపీ సి ఎం శ్రీ వై ఎస్ జగన్ గారికి కృతఙ్ఞతలు. షూటింగ్స్ పునః ప్రారంభించేందుకు విధి విధానాలతో పాటు,థియేటర్స్ కి ఉన్న ఫిక్సడ్ పవర్ చార్జీలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న వారికి ధన్యవాదాలు'అని పేర్కొన్నారు.

    English summary
    Chiranjeevi Thanks To CM YS Jagan For Tollywood To encourage In AP. Tollywood Big Wigs meets Ys Jagan Mohan Reddy. Chiranjeevi, Nagarjuna, Trivikram, Rajamouli, Suresh Babu Met With Ap CM To Discuss ABout Tollywood Shift To AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X