twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేలాదిమంది దినసరి కూలీలకు ఊరట కలిగేలా నిర్ణయం.. కేసీఆర్‌కు చిరంజీవి కృతఙ్ఞతలు

    |

    లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమను ఎంతగానో దెబ్బతింది. అలాంటి చిత్రసీమను ఆదుకునేందుకు తిరిగి షూటింగ్స్‌ను ప్రారంభించడం, థియేటర్స్‌ను ఓపెన్ చేయడం లాంటి అంశాలపై సినీ పెద్దలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ మంత్రి తలసాని ఆధ్వరంలో కేసీఆర్ నేతృత్వంలో జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలను అనుసరించి, వీలైనంత తక్కువ మందితో షూటింగ్స్ జరపాలంటూ కేసీఆర్ సూచించారు. కేసీఆర్ సానుకూల స్పందనపై మెగాస్టార్ చిరంజీవి కృతఙ్ఞతలు తెలిపారు.

    దశలవారీగా..

    దశలవారీగా..

    లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సూచించారు. తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సిఎం చెప్పారు.

    థియేటర్స్ విషయమై..

    థియేటర్స్ విషయమై..

    తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సీఎం సూచించారు. ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం చెప్పుకొచ్చారు.

    భేటీలోని టాలీవుడ్ ప్రముఖులు..

    భేటీలోని టాలీవుడ్ ప్రముఖులు..


    తలసాని నేతృత్వంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున, రాజమౌళి,త్రివిక్రమ్, N. శంకర్, అల్లుఅరవింద్, దిల్ రాజు,రాధాకృష్ణ, C.కళ్యాణ్, సురేష్ బాబు, కొరటాల శివ, జెమినికిరణ్, మెహర్ రమేష్ వంటి వారున్నారు.

    చిరు కృతఙ్ఞతలు..

    చిరు కృతఙ్ఞతలు..

    షూటింగ్స్ ప్రారంభించడంపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌కు చిరంజీవి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు తెలిపారు. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చార'ని చెప్పుకొచ్చారు.

    English summary
    Chiranjeevi Thanks To KCR For Green Signal To Re Start Shooting. I wholeheartedly thank Hon'ble CM #KCR garu on behalf of the Film, TV & Digital Media industries for granting a patient hearing & his kind reassurance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X