twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం జగన్‌తో చిరు భేటీ.. లాక్‌డౌన్ అనంతరం చర్చలు.. ఆ అంశాలపైనే ఫోకస్

    |

    మెగాస్టార్ చిరంజీవినే ఊరికే సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అని అనడం లేదు. కొన్ని సంఘటలను, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్త.. సినిమా పరిశ్రమకు చిరంజీవి దిక్సూచిలా ఉన్నారని అర్థమవుతోంది. లాక్‌డౌన్‌ను అమలు చేయకముందే.. కరోనా ప్రభావాన్ని పసిగట్టి ఎంతో మందికి మేలు చేసేలా తన ఆచార్య చిత్ర షూటింగ్‌ను వాయిదా వేశారు.

    అనంతరం చిరంజీవి బాటలో చిత్ర పరిశ్రమ మొత్తం లాక్‌డౌన్‌ను పాటించింది. అదే విధంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర సీమకు కూడా మినహాయింపులు ఇవ్వాలని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులతో చిరంజీవి చర్చలు జరుపుతున్నారు. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్‌తో భేటీ ముగియగా.. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌తోనూ భేటీ ఉంటుందని ప్రకటించారు.

    సానుకూలంగా స్పందించిన కేసీఆర్..

    సానుకూలంగా స్పందించిన కేసీఆర్..

    సినీ పరిశ్రమ తరుపున చిరంజీవితో పాటు కొందరు పెద్దలు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. ఈ మేరకు కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే షూటింగ్‌లకు అనుమతి ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

    ధన్యవాదాలు తెలిపినచిరు..

    ధన్యవాదాలు తెలిపినచిరు..

    కేసీఆర్‌తో భేటీ అనంతరం చిరు ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు' అని పేర్కొన్నాడు.

    సీఎం జగన్‌తో భేటీ..

    సీఎం జగన్‌తో భేటీ..

    చిరంజీవి తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరుపున వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియచేసాను. లాక్ డౌన్ ముగిసిన తరువాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని చెప్పారు. అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది' అని ప్రకటించారు.

    Recommended Video

    Chiranjeevi Had A Meeting With Talasani Srinivas Yadav About TFI Future Plans
    ఆ అంశాలపైనే ఫోకస్..

    ఆ అంశాలపైనే ఫోకస్..

    జగన్‌తో భేటిలో ముఖ్యంగా సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు నంది అవార్డుల విషయం చర్చకు రానుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమా థియేటర్స్ ఓపెనింగ్.. కార్మికుల జీత భత్యాలతో పాటు రాయితీలు, ప్రోత్సాహకాలపై కూడా చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ను ఏపీకి షిఫ్ట్ చేసే ఆలోచన కూడా ఈ భేటిలో ఉండబోతుందని తెలుస్తోంది.

    English summary
    Chiranjeevi To Meet YS Jagan About Cine Industry Issues. he says That Heartily thank Sri ysjagan for issuing the GO for the single window system and agreeing to meet soon after the lockdown to discuss film industry issues
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X