గుండు బాస్‌గా చిరంజీవి.. మెగాస్టార్ న్యూ లుక్ ఏ సినిమా కోసమంటే?

మెగాస్టార్ చిరంజీవిని తెర మీద ఎన్నో విభిన్నమైన గెటప్స్‌లో చూశాం. మీసాలు లేకుండా సెన్సిటీవ్‌గా, గెడ్డం లుక్‌తో రఫ్‌గా ఇలా రకరకాల పాత్రల్లో ఇప్పటి వరకు చూసి ఎంజాయ్ చేశాం. తాజాగా చిరంజీవి లుక్‌ చూస్తే షాక్ అయ్యేంత పని అవుతున్నది. అయితే ఈ గెటప్ ఏ సినిమా కోసమంటే..

Recommended Video

Megastar Chiranjeevi లేటెస్ట్ లుక్, Ram Charan షాక్ | రజినీ గెటప్ తో పోలిక! || Oneindia Telugu
పలు రకాలు గెటప్స్‌తో

పలు రకాలు గెటప్స్‌తో


చిరంజీవి కెరీర్‌ గురించి ఆలోచిస్తే.. ఖైదీ నంబర్ 150కి ముందు.. ఆ తర్వాత అని రెండు రకాలుగా అనుకోవచ్చు. రాజకీయ రంగానికి వెళ్లి దాదాపు ఓ దశాబ్దం తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు మాస్, క్లాస్ అంశాలతో చంటబ్బాయి, ఆపద్బాంధవుడు, ఆరాధనలో విభిన్న గెటప్స్‌లో కనిపించి అభిమానులను రంజింప చేశారు. ఇప్పుడు విభిన్నమైన పాత్రలను ధరించేందుకు సిద్ధమవుతున్నారు.

విభిన్నమైన పాత్రలతో

విభిన్నమైన పాత్రలతో

రాజకీయ రంగం నుంచి మళ్లి వెండితెరపైకి వచ్చిన తర్వాత ఖైదీ నంబర్ 150 చిత్రంలో వ్యవసాయ సమస్యను తీసుకొని మాస్ అంశాలను కలబోసి ప్రేక్షకులను మెగాస్టార్ చిరంజీవి మెప్పించారు. ఆ తర్వాత సైరా నర్సింహరెడ్డి చిత్రంతో ఆకట్టుకొన్నారు. సైరాలో కూడా గెటప్ ప్రధానంగానే క్యారెక్టర్‌ను వేశారు. సైరాలో క్యాస్టూమ్ ఆధారిత పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి.

ఆచార్యలో కూడా సరికొత్త గెటప్‌తో

ఆచార్యలో కూడా సరికొత్త గెటప్‌తో

ఇక త్వరలో రాబోతున్న ఆచార్య చిత్రంలో యంగ్ అండ్ ఓల్డ్ గెటప్‌లో చిరంజీవి కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆచార్యలో కూడా వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. నక్సలైట్‌గా, అధ్యాపకుడిగా నటించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ పాత్రలో విషయంలో గెటప్స్ వరకు వస్తే పెద్దగా తేడాలేదనే విషయం స్పష్టమవుతున్నది.

వెండితెరపై గుండు పాత్రలో మొదటిసారిగా

వెండితెరపై గుండు పాత్రలో మొదటిసారిగా


ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు వేసినా గుండులో మాత్రం మెగాస్టార్ చిరంజీవి కనిపించలేదు. తాజాగా రిలీజ్ చేసిన గుండు గెటప్‌ ఒక్కసారిగా అభిమానులు షాక్ చేసింది. అయితే త్వరలో సెట్స్‌పైకి వెళ్తున్న ఓ సినిమా కోసం ఇలాంటి గెటప్‌లో కనిపించనున్నట్టు సమాచారం. అయితే ఏ సినిమా? డైరెక్టర్ ఎవరు అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. అయితే చిరంజీవి గెటప్ మాత్రం అభిమానులు షాక్‌తోపాటు ఆనందంలో ముంచెత్తుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X