»   » మూడు రోజుల పాటు షూటింగులో చిరంజీవి

మూడు రోజుల పాటు షూటింగులో చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మాక చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న 'బ్రూస్ లీ- ద ఫైటర్' సినిమాపై రోజు రోజుకూ భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలోని 'లే చలో' సాంగ్ ఇప్పటికే కుర్రకారును కిర్రెక్కిస్తోంది. థమన్ బాణీల్లో రూపొందిన ఇతర పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించే స్థాయిలోనే సిద్ధమయ్యాయని వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'బ్రూస్ లీ' టీజర్స్, ఫస్ట్ లుక్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అందరిలోనూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Chiranjeevi to shoot for 3 days

ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీరిస్తారు. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శరవేగంగా ఈ చిత్ర నిర్మాణం సాగుతోంది. ఓ వైపు చిత్రీకరణ సాగుతూ ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా పూర్తవుతోంది. అక్టోబర్ 2న 'బ్రూస్ లీ' ఆడియో విడుదల కానుంది. అదే నెల 16న 'బ్రూస్ లీ' ఎట్టిపరిస్థితుల్లోనూ జనం ముందు నిలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ కు జోడీగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తీరు ట్రయిలర్స్ లోనే యువతకు హుషారు కలిగిస్తోంది. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని నిర్మాత డి.వివి.దానయ్య, చిత్ర యూనిట్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్: వి. వై.ప్రవీణ్ కుమార్ , సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి.

English summary
It is well known that Megastar Chiranjeevi will be playing a cameo in Ram Charan’s upcoming film Bruce Lee. Reports reveal that he will shoot for a song and a fight sequence along with Ram Charan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu