హాట్ టాపిక్: ఉదయ్ కిరణ్ కి చిరు షేక్ హ్యాండ్

By Srikanya

ఇప్పుడు పరిశ్రమలో హాట్ టారిక్ ఉదయ్ కిరణ్ కి చిరంజీవి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనేదే. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్శ్ కి టి.సుబ్బిరామ రెడ్డి జరిగిన భారీ సన్మాన కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఉదయ్ కిరణ్ అప్పట్లో చిరంజీవికి అల్లుడు కావాల్సింది చివరి నిముషంలో ఆగిపోయింది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, ఉదయ్ కిరణ్ ఒకరినొకరు ప్రేమించుకోవటంతో అది ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్లి గొడవలు వచ్చి ఆగిపోయింది. అప్పటినుంచి అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి ఉదయ్ కిరణ్ కి దరిద్రం పట్టినట్లైంది. ఒక్క హిట్టు లేకుండా గడిచిపోయింది. చాలా కాలం అతనితో సినిమాలు తీయటానికి నిర్మాతలే రాలేదు. తర్వాత వచ్చిన ఒకరిద్దరూ ఉదయ్ కిరణ్ ప్లాపులు చూసి పరారయ్యారు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ఈ గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నాడు. అతను, శ్వేతాబసు కలిసి నటించిన చిత్రం కూడా ఎవ్వరూ కొనక విడుదల కాక ల్యాబ్ లో మగ్గిపోతోంది. మరి ఈ షేక్ హ్యాండ్ తో అయినా ఉదయ్ కిరణ్ కెరీర్ కి వెలుగు వస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X