హాట్ టాపిక్: చిరంజీవి అండర్ వేర్ సీన్ గురించే....?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ నెం.150'. చిరంజీవి కెరీర్లో ఇది 150వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరక్కిస్తున్నారు.
ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ప్రయోగాలకు పోకుండా.... ఆల్రెడీ తమిళంలో హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే సినిమాను తమిళంలో ఉన్నట్లు మక్కికి మక్కి, సీన్ టు సీన్ కాకుండా... మెగాస్టార్ ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేస్తున్నారని చెబుతున్నారు.
కాగా.... ఇటీవల కత్తి సినిమాను తమిళంలో చూసిన కొందరు అందులో ఉన్న కొన్ని రకాల సీన్లు తెలుగులో రిపీట్ అవుతాయా? ఆ సీన్లు చిరంజీవి చేస్తారా? అనే విషయమై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

మెగాస్టార్ అండర్ వేర్ సీన్ ఉంటుందా?
కత్తి తమిళ వెర్షన్ లో హీరో విజయ్ ఓ సీన్లో అండర్ వేర్ తో నటించారు. పోలీస్ స్టేషన్లో సీన్ లా ఉంది. ఒక స్టార్ హీరో అండర్ వేర్లో కనిపించడం అంటే సీన్ లో తీవ్రత, సహజత్వం కోసమే అలా చేసి ఉంటారు. మరి చిరంజీవి కూడా దాన్ని ఫాలో అవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

కమర్షియల్ ఎంట్టెనర్
చిరంజీవి సినిమాలంటేనే వినోదానికి పెట్టింది పేరు. ఆయన కెరీర్లో కొన్ని ప్రయోగాత్మక సనిమాలు చేసినా.... ఎక్కువగా చేసినవి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టనర్సే. ఆయన అభిమానులు ఎక్కువగా ఇలాంటి సినిమానే కోరుకుంటున్న నేపథ్యంలో 150వ సినిమా కూడా అలానే రూపొందిస్తున్నారు.

అన్నీ ఉంటాయి
చిరంజీవి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నాయి. అదిరిపోయే ఫైట్స్, మంచి ఊపు నిన్చే డాన్సింగ్ నెంబర్స్, కామెడీ, ఎమోషన్ తో పాటు సెంటిమెంటు, ఐటం సాంగ్ ఇలా అన్ని అంశాలు కలగలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అందుకే రామ్ చరణ్
చిరంజీవి 150వ సినిమా అంటే ఎంతో ప్రతిష్టాత్మకం. వేరే నిర్మాత చేతిలో సినిమాను పెట్టడం కంటే సొంత బేనర్లో అయితేనే బావుంటుందనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తన జీవితంలో మరుపురాని జ్ఞాపకంలా ఈ సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాజల్ సొగసులు
సినిమాలో హీరోయిన్ కాజల్ సొగసలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. తెలుగులో ఎన్నో చిత్రాల్లో తన అందం, ఆభినయంతో ఆకట్టుకున్న కాజల్.....ఈ సినిమాలో సరికొత్త లుక్ తో, అట్రాక్టివ్ గా కనిపించబోతోంది.

టాప్ టెక్నీషియన్స్
సౌత్ లో టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు కూడా ఈ సినిమాను పని చేస్తున్నారు,

శర వేగంగా...
సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2017 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగిన విధంగనే చకచకా సినిమాను ముందుకు నడిపిస్తున్నారు వినాయక్.

డబ్బింగ్ మొదలైంది
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ఐటం సాంగులో కేథరిన్ నటిస్తోందట.

చరణ్ టెన్షన్
తొలి సినిమా నిర్మాతగా టెన్షన్ ఉన్నా.. అంతకుమించి బాధ్యతగా పని చేస్తున్నాను. దర్శకుడు వి.వి.వినాయక్ గారు పెద్ద అండ. అన్నీ ఆయనే అయ్యి పూర్తి సపోర్టు ఇస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. కొన్ని పాటలు, టాకీ, ఫైట్స్ తెరకెక్కించాల్సి ఉంది అని చరణ్ తెలిపారు.

అంచనాలు భారీగా
చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


Click it and Unblock the Notifications











