షూటింగ్ కోసం కాదు... చిరంజీవి, వెంకీ, ఇతర స్టార్స్ వైజాగ్ రహస్యం ఇదే!

సినీ స్టార్స్ వైజాగ్ వెళ్లారు అంటే సినిమా షూటింగులు లేదా ఏదైనా సినిమా ఫంక్షన్ లాంటివి ఉండి ఉంటాయని అంతా భావిస్తారు. అయితే ఇవేవీ లేకున్నా చిరంజీవి, వెంకటేష్ లాంటి ప్రముఖులు, మరికొందరు టాలీవుడ్ స్టార్స్ తరచూ వైజాగ్ వెళుతుండటం చర్చనీయాంశం అయింది.

ఈ విషయాలు ఆరాతీసిన అభిమానులకు, మీడియా వారికి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. వైజాగ్‌లో ఓ ప్రదేశాన్ని వారు తరచూ సందర్శిస్తున్నట్లు గుర్తించారు. మొదట సరదాగా వెళ్లి తర్వాత ఇక్కడకు రెగ్యులర్‌గా రావడం మొదలుపెట్టారట.

టాలీవుడ్ స్టార్స్ వైజాగ్ సీక్రెట్ ఇదే...

టాలీవుడ్ స్టార్స్ వైజాగ్ సీక్రెట్ ఇదే...

చిరు, వెంకీతో పాటు పలువురు స్టార్స్ తరచూ వైజాగ్ రావడానికి కారణం ఇక్కడి ఓ వెల్‌నెస్ సెంటర్ వారికి బాగా నచ్చడమే అని తెలుస్తోంది. పని ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు రిలాక్స్ అయ్యేందుకు వారు ఇక్కడికి వస్తున్నారట.

వెంకీ రెగ్యులర్‌గా

వెంకీ రెగ్యులర్‌గా

వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియో సమీపంలో ఈవెల్ నెస్ సెంటర్ ఉండటంతో ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళిన వెంకటేష్... తర్వాత రెగ్యులర్ అయ్యారని, వెంకటేష్ బ్రదర్ సురేష్ బాబు కూడా ఇక్కడికి వస్తుంటారని తెలుస్తోంది.

హోటల్ వర్కౌట్ కాలేదు... వెల్‌నెస్ సెంటర్ క్లిక్ అయింది

హోటల్ వర్కౌట్ కాలేదు... వెల్‌నెస్ సెంటర్ క్లిక్ అయింది

వాస్తవానికి ఈ వెల్‌నెస్ సెంటర్ మొదలు కాక ముందు ఇక్కడ పెద్ద హోటల్ ఉండేది. అయితే అది వర్కౌట్ కాక పోవడంతో దాన్నే వెల్‌నెస్ సెంటర్‌గా మార్చారని తెలుస్తోంది.

 గతంలో బెంగుళూరు వెళ్లేవారు

గతంలో బెంగుళూరు వెళ్లేవారు

గతంలో టాలీవుడ్ స్టార్స్ బెంగుళూరులోని వెల్‌నెస్ సెంటర్లను సందర్శించే వారు. అయితే ఇపుడు వైజాగ్‌లోనే మంచి వెల్‌నెస్ అందుబాటులోకి రావడం, మన తెలుగు ప్రాంతం కూడా కావడంతో చిరు, వెంకీ లాంటి టాప్ సెలబ్రిటీలు సైతం ఇక్కడికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X