మీసం మెలేయ్యడం వీరత్వం కాదు.. హీరో కార్తీకేయకు చిరంజీవి షాక్, ఈషారెబ్బాకు కూడా అలా ఝలక్

సామాజిక బాధ్యతను పాటించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పడూ ముందుంటారు. రక్తదానం, నేత్రదానం లాంటి కార్యక్రమాలే కాకుండా సమాజానికి, దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా తన వంతు బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా తన చుట్టు ఉన్న పదిమందికి గుర్తు చేస్తుంటారు. తాజాగా ప్రపంచాన్ని కరోనావైరస్ ముప్పు వెంటాడుతున్నది. ఈ క్రమంలో గత మూడు నెలలుగా తన వంతు సేవా, అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలకు ముప్పు పెరిగిన నేపథ్యంలో చిరంజీవి మరోసారి స్పందించారు. మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో అనే విషయాన్ని తెలియజేస్తూ హీరో కార్తీకేయ, హీరోయిన్ ఇషా రెబ్బాతో ఓ వీడియోను రూపొందించారు. అవేంటో మీరే చూడండి..

కోవిడ్ పరిస్థితులు మరింత దారుణంగా

కోవిడ్ పరిస్థితులు మరింత దారుణంగా

కరోనావైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టేడ్రోస్ తెలిపిన ప్రకారం.. కోవిడ్ 19 పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇలాంటి ముప్పును తప్పించాలంటే.. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడుకొండి అంటూ ట్వీట్ చేశారు.

కార్తీకేయ, ఇషారెబ్బాతో వీడియో

కార్తీకేయ, ఇషారెబ్బాతో వీడియో

మాస్క్ ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి హీరో కార్తీకేయ, హీరోయిన్ ఇషారెబ్బతో కలిసి వీడియోలను రూపొందించారు. నా ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన కార్తీకేయ, ఇషారెబ్బాకు ధన్యవాదాలు. సొసైటీ పట్ల మీకు ఉన్న కమిట్‌మెంట్‌ను చూసి ముచ్చటపడుతున్నాను. ఈ విషయంలో మిమల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని చిరంజీవి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

కార్తీకేయతో చిరంజీవి

కార్తీకేయతో చిరంజీవి

చిరంజీవి, కార్తీకేయ రూపొందించిన తొలి వీడియోలో.. కార్తీకేయ మాస్క్ ధరించకుండా మీసాలు దువ్వకుంటుంటే.. చిరంజీవి మాస్క్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. చిరు విసిరిన మాస్క్‌ను కార్తీకేయ అందుకొని.. మాస్క్‌పై ఉన్న మీసాలపై చేయి వేసి దువ్వుకోవడం లాంటి సీన్లతో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

ఇషారెబ్బతో మెగాస్టార్

ఇషారెబ్బతో మెగాస్టార్

ఇక ఇషారెబ్బతో కూడా చక్కటి వీడియోను చిరంజీవి డిజైన్ చేశారు. మాస్క్ లేకుండా పెదాలకు లిప్‌స్టిక్ పెట్టుకొని సౌందర్యాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చేస్తున్న ఇషా రెబ్బాకు ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ప్రాధాన్యతను వివరించారు. దాంతో చిరంజీవిని అనుసరిస్తూ మాస్క్ ధరించి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని ఇంపార్టెన్స్ ఏమిటో చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
చిరునవ్వు కలకాలం ఉండాలంటే..

చిరునవ్వు కలకాలం ఉండాలంటే..

హాయ్.. చిరునవ్వు ముఖానికి అందం. ఇప్పుడున్న ఆ చిరునవ్వు కలకాలం ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించాలి. తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించండి. వీలైనన్నీ సార్లు చేతులు సబ్బుతో కడుక్కోండి. అలాగే మీ కుటుంబాన్ని, ఈ దేశాన్ని కాపాడండి. ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకొన్నారు.

మీసం మెలేయ్యడం వీరత్వం ఒకప్పుడు.. ఇప్పుడు

మీసం మెలేయ్యడం వీరత్వం ఒకప్పుడు.. ఇప్పుడు

కార్తీకేయతో రూపొందించిన వీడియోలో ఇస్తూ.. మీసం మెలేయడం వీరత్వమే. కానీ అది ఒకప్పుడు ఇప్పుడు ముఖానికి మాస్క్ ధరించడమే వీరత్వం అంటూ మాస్క్ అందిస్తూ చిరంజీవి సందేశాన్ని అందించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలంటూ ప్రజలకు సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X