ఖతర్ చేరిన చిరంజీవి.. ఆయన వెంట విజయ్ దేవరకొండ కూడా

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు 15 నుండి ఖతార్‌లోని దోహాలో జరగనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ అవార్డుల వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేస్తుండగా.. టాలీవుడ్ నుంచి ఎంతోమంది నటీనటులు అటెండ్ అవుతున్నారు. ఈ మేరకు ఒక్కొక్కరుగా సెలబ్రిటీలంతా ఖతర్ చేరుకుంటున్నారు. ఈ మేరకు వారి ఫోటోలు చూపుతూ సైమా అధికారిక ట్విట్టర్ ద్వారా అప్‌డేట్ ఇస్తోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సందీప్ వంగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కేజీఎఫ్ స్టార్ యష్ ఖతర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ వాళ్ళు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖతర్ అంతా టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలతో కళకళలాడిపోతోంది. ఇప్పటికే యాంకర్ అనసూయ అక్కడికి చేరుకోగా, తాజాగా యాంకర్ సుమ, కీర్తి సురేష్, రాధిక, త్రిష సహా ఇంకా చాలామంది హీరోయిన్లు చేరుకున్నారు.

Chiranjeevi, Vijay Deverakonda at SIIMA Awards 2019

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినీ సెలబ్రిటీలకు గురువారం, శుక్రవారం సైమా అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ మెగాస్టార్ మోహల్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు మెగాహీరోలు పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X