జమున ఫ్యామిలీకి కృష్ణ, చిరంజీవి ఓదార్పు (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్‌: ప్రముఖ సినీయర్ నటి జమున భర్త రమణారావు (86) సోమవారం రాత్రి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే పలువురు తెలుగు సినీ ప్రముఖులు జమున ఇంటికి చేరుకుని వారి కుటుంబాన్ని ఓదార్చారు.

ప్రముఖ నటుడు కృష్ణ, విజయ నిర్మలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ తదితరులు జమున కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి కూడా జమున ఇంటికి వచ్చి పరామర్శించారు.

రమణారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. జమున, రమణారావు దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా అమ్మాయి చిత్రకళాకారిణి. రమణారావు భౌతిక కాయానికి మంగళవారం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుపనున్నారు. స్లైడ్ షోలో ఫోటోలు...

చిరంజీవి

చిరంజీవి

రమణారావు మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవి జమున నివాసానికి చేరుకున్నారు.

కృష్ణ-విజయ నిర్మల

కృష్ణ-విజయ నిర్మల

జమున కుటుంబాన్ని ఓదారుస్తున్న కృష్ణ-విజయ నిర్మల దంపతులు

మురళీ మోహన్

మురళీ మోహన్

జమునను ఓదారుస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్.

చిరంజీవి నివాళి

చిరంజీవి నివాళి

రమణారావు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పిస్తున్న చిరంజీవి.

ఓదార్పు

ఓదార్పు

జమున కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న చిరంజీవి, మురళీ మోహన్.

విజయ నిర్మల

విజయ నిర్మల

దు:ఖ సాగరంలో మునిగిపోయిన జమునను ఓదారుస్తున్న విజయనిర్మల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X