అప్పుడు ‘ఠాగూర్’...ఇప్పుడు ‘అదుర్స్’
అదుర్స్ ఆడియో వేడుకలో రాజమౌళి అన్న మాటలు ఎంత సంచలనం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ మాటలను రెండు ఉద్ధేశ్యాలతో రాజమౌళి చెప్పినట్టు అతని సన్నిహితులు అనుకోవటం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. అందులో ఒక రీజన్ ఏంటంటే తన దర్శకత్వంలో వచ్చిన 'సింహాద్రి" చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అదే సంవత్సరం వచ్చిన వినాయక్ చిత్రం 'ఠాగూర్" కూడా కమర్షియల్ గా మంచి హిట్ కొట్టడమే కాకుండా ఈ సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్ అనుకుంటున్న 'సింహాద్రి" ని థియేటర్ల రికార్డు విషయంలో క్రాస్ చేసింది.
అలాగే ఈ సంవత్సరం 'మగధీర" చిత్రం కూడా రాజమౌళికి సూపర్ హిట్ నిచ్చింది. అయితే ఆ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తన రికార్డును బ్రేక్ చేసే సత్తా ఒక్క వివి వినాయక్ కే వుందన్నది రాజమౌళి నమ్మకం. అందుకే ఆడియో వేడుకలో ఆ మాటన్నాడనేది బాగా వినిపిస్తోంది. అలాగే ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో సహజంగానే అతని మీద ఇష్టంతో అలా అని వుంటాడనేది కూడా వినవస్తోంది. ఏది ఏమైనా అప్పుడు తన చిత్ర రికార్డులను వివి వినాయక్ చిరుతో తీసిన 'ఠాగూర్" తో చిరుకాలంలోనే తిరగరాస్తే ఇప్పుడు 'సింహాద్రి" చిత్రాన్ని తీసిన రాజమౌళి చిరు తనయునితో 'మగధీర" ను ఇచ్చాడు కాబట్టి దాన్ని తలదన్నే హిట్ ను నాటి 'ఠాగూర్" దర్శకుడు వినయ్ తనకు ఇస్తాడన్న ధీమాలో ఉన్నాడనేది మరో కథాంశం. ఈ విచిత్ర గేమ్ లో వినయ్ మరోసారి కూడా విజయం సాధిస్తాడో లేదో మరి.


Click it and Unblock the Notifications











