అన్నను కాదని సోదరి కుమారుడికి పట్టాభిషేకం...!?
కొంత కాలం నుండి అన్నయ్యతో అంటి అంటనట్టు ఉన్న పవన్ కళ్యాణ్ తన సోదరి కుమారుడిని వెండితెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని ఫిల్మిం నగర్ వర్గాల సమాచారం. అయితే ఇది ఎంతవరకూ సమంజసమో తెలియదు కానీ చిరు అంటే గిట్టని వారు ఇరవై నాలుగు గంటలు ఇదే టాపిక్ పై గుసగుసలాడుతున్నట్టు సమాచారం. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్, రెండు సినిమాలతోనే తన సత్తాఏంటో నిరూపించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రామ్ చరణ్ కంటూ ఒక ట్రెండ్ సృష్టించుకున్నాడు. ఇలాంటి సమయంలో చిరంజీవి సోదరి కుమారుడు సినీ రంగప్రవేశం చేస్తున్నాడనీ, వార్త గుప్పుమన్నాయి. తన కుమారుడికి తన మేనళ్ళుడు పోటి అవుతాడని చిరు భావిస్తున్నాడని పీఆర్పీ నుండి బయటకు వెళ్లిన కొందరు ప్రచారం చేస్తున్నారని సమాచారం.
అయితే ఇప్పటికే మరో మేనళ్ళుడు అల్లు అర్జున్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ చిరంజీవి ఇలా ప్రవర్తించడాన్ని ఆయన సన్నిహితులు అంటున్నారు. కన్నడగడ్డమీద పుట్టిన శ్రీకాంత్ నే తెలుగు చిత్ర సీమలో ప్రోత్సహించిన చిరు, సొంత కుటుంబంలోనున్న వ్యక్తి కి అడ్డు పడడని అంటున్నారు.మరో వైపు అన్నయ్యను ఎదిరించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క మగాడు దర్శకుడు వైవియస్ చౌదరి చేతుల్లో తన మేనల్లుడిని పెట్టి మంచి సినిమా తీయాలని ఎన్ని కోట్లు ఖర్చైనా నేనుంన్నానంటూ భరోసా ఇచ్చారని సమాచారం. అవసరమైతే తానే రెండో సారి దర్శకత్వం వహించి తన మేనల్లుడిని పరిచయం చేస్తానని పవన్ అన్నారని సమాచారం. మరోవైపు గీతా ఆర్ట్స్ లో నాగార్జున కుమారుడు నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ విధంగా సినిమా అంటే సినిమానే, కుటుంబం అంటే కుటుంబమే అని భావించే వీరు సొంత కుటుంబంలోనే సినీ రంగంలోకి వస్తుంటే అడ్డుపడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిరు సన్నిహితులు విమర్శస్తున్నారు.


Click it and Unblock the Notifications











