అలాంటి సినిమాల్లో అయితే చేస్తా చిరంజీవి గ్రీన్ సిగ్నల్
చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ ప్రెవేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..అభిమానులు కోరితే సినిమాల్లో నటిస్తానని, అయితే సామాజిక ప్రయోజనాలున్న సినిమాలోనే నటిస్తానని చెప్పారు. అయితే ఇప్పటికే సామాజికాంశం ప్రధానాంశంగా ఓ కథను ఎంపికచేసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. పరుచూరి బ్రదర్శ్ చెప్పిన ఓ పాయింట్ నచ్చి ఆ కథతో సినిమా చేద్దామని, ఆయన మీదే పూర్తి కథ కాకుండా మరో యంగ్ హీరో కూడా ఉండేటట్లు రాయమని పురమాయించినట్లు సమాచారం. ఆ యంగ్ హీరో అయన కుమారుడు రామ్ చరణా లేక వేరే కుర్రహీరో నా అనేది బయిటకు రాలేదు. ఇక గతంలోనే ఆయన నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆయన దాన్ని తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
చిరంజీవి ఠాగూర్ స్టాలిన్ అల్లు అర్జున్ పరుచూరి బ్రదర్శ్ chiranjeevi tagore stalin allu arjun paruchuri brothers


Click it and Unblock the Notifications