నా 150వ సినిమాలో తమన్నా: చిరంజీవి
''అభిమానులు నా 150వ సినిమా గురించే అడుగుతున్నారు. దానికి సమాధానం నా దగ్గర లేదు. ఆ సినిమాని నిర్ణయించేది కేవలం కథ మాత్రమే. కథ డిమాండ్‌ని బట్టి 150వ సినిమా ఉంటుంది. ఆ సినిమా నేను చేస్తే, అందులో తమన్నా హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని నా కోరిక'' అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'రచ్చ' ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి పై విధంగా స్పందించారు.
చిరంజీవి 150 చిత్రం గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు వినపడుతున్నాయి. పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తారని,వివి వినాయిక్ డైరక్ట్ చేస్తారని చెప్పుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఆ చిత్రం గురించి అధికారికంగా ఏ ప్రకటనా వెలవడలేదు. అయితే రాజకీయాల్లో బిజిగా ఉన్న చిరంజీవి ఇక 150 సినిమాను పూర్తి చేయరనే అనుకున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన ఈ కామెంట్స్ మళ్ళీ ఆయన అభిమానుల్లో ఆశలు చిగురింప చేస్తున్నాయి. తను చిత్రం చేస్తే సందేశాత్మకంగా ఠాగూర్ తరహా చిత్రం చేస్తానని ఆయన గతంలో చెప్పి ఉన్నారు.


Click it and Unblock the Notifications











