twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీలో చిరంజీవి స్థాయి మరొకరికి లేదు.. ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మెగాస్టార్‌కే

    |

    Recommended Video

    T Subbarami Reddy Press Meet || Filmibeat Telugu

    దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావుగారిలో తనకు నచ్చిన అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్. దాసరిగారు ఎదుటి వారి సినిమా సక్సెస్ అయితే అది తన సక్సెస్ లాగా ఫీలవ్వడంతో పాటు పది మందికి తెలిసేలా చేస్తారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి సహాయం కోసం వస్తే ఒక తండ్రి, ఒక మిత్రుడు ఎలా ఆదుకుంటారో తన స్థాయిని మరిచి అవతలి వారిని ఆదుకుని షేక్ హ్యాండ్ ఇచ్చే స్వభావం ఆయనది. ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీకి వస్తే ఇక్కడ నిలదొక్కుకునేలా వారికి తన వంతు సహాయం చేస్తారు... అని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    ‘చిరంజీవిగారు గౌరవింపబడే రేంజిలో లేరు ఎవరూ లేరు’

    ‘చిరంజీవిగారు గౌరవింపబడే రేంజిలో లేరు ఎవరూ లేరు’

    దాసరి నారాయణగారి ప్లేసు భర్తీ చేయగలిగే వ్యక్తి కేవలం చిరంజీవిగారు మాత్రమే. ఒక వ్యక్తి ఇండస్ట్రీలో పెద్ద అంటే ఆయన మాటను అందరూ గౌరవించాలి. ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న వారిలో ఎవరు కూడా చిరంజీవిగారు గౌరవింపబడే రేంజిలో లేరని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    చిరంజీవిగారు కబురు పెడితే...

    చిరంజీవిగారు కబురు పెడితే...

    చిరంజీవిగారు కబురు పెట్టారు అంటే ఎందుకు? ఏమిటి? ఏదైనా తప్పు జరిగిందా? ఆయన ఏదైనా చెబితే తప్పకుండా చేయాలి అని మెంటల్‌గా ప్రిపేర్ అయి వెళతారు. ఆయన మాటకు అడ్డు చెప్పే ప్రయత్నం ఎవరూ చేయకపోవచ్చు అని సి కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు.

    చిరంజీవిగారే తగిన వ్యక్తి అని ఇప్పటికే చెప్పాను

    చిరంజీవిగారే తగిన వ్యక్తి అని ఇప్పటికే చెప్పాను

    దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీకి వచ్చి దర్శకరత్నగా ఎలా ఎదిగారో... చిరంజీవిగారు కూడా ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి మెగాస్టార్‌గా ఎదిగారు. ఈ రోజు చిరంజీవిగారు పిలిచి ఒక మాట చెప్పారు అంటే కాస్త మొండిగా ఉండే పర్సన్ కూడా చిరంజీవిగారు చెప్పారు కాబట్టి మనం దాన్ని సరిదిద్దు కోవాలని పీలవుతారు. దాసరి నారాయణరావుగారి సంస్కరణ సభలో కూడా నేను చిరంజీవిగారి పేరు చెప్పినట్లు కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

    వీడు మనకు చెప్పడమేంటి? అనే ఫిలింగ్ కూడా ఉండొచ్చు

    వీడు మనకు చెప్పడమేంటి? అనే ఫిలింగ్ కూడా ఉండొచ్చు

    చాలా మంది ఫిల్మ్ ఫెడరేషన్లో సి కళ్యాణ్ గారు... దాసరి నారాయణరావుగారి తర్వాత మీరే అంటుంటారు. మేమంతా భుజాన వేసుకోగలిగినవారం. నేను చెబితే కూడా కొందరు మాట వినేవారు ఉండక పోవచ్చు. వీడు మనకు చెప్పడమేంటి? అనే ఫిలింగ్ ఉండొచ్చు. ఇదే చిరంజీవిగారు చెబితే ఆ ఫీలింగ్ ఉండదు. ఎప్పుడైతే ఒక మనిషి మీద మనకు అభిమానం ఉంటుందో, నమ్మకం ఉంటుందో, అతడే మనకు పెద్ద దిక్కు అయితే మనం కన్విన్స్ అవుతాం. అందుకే ఇప్పుడున్న వారిలో ఆ ప్లేసుకు చిరంజీవిగారే తగిన వ్యక్తి అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    English summary
    C Kalyan said Chiranjeevi was the only one who could replace Dasari Narayana Rao. Chiranjeevi's word is only respected in the Telugu film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X