»   » ‘సుప్రీమ్’షోలో చిరంజీవి, మేనల్లుడికి శుభాకాంక్షలు (ఫోటోస్)

‘సుప్రీమ్’షోలో చిరంజీవి, మేనల్లుడికి శుభాకాంక్షలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సుప్రీమ్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నిన్న రాత్రి మెగా స్టార్ చిరంజీవి కోసం చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రసాద్ ల్యాబ్స్‌లో స్పెషల్ షో వేసారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... సినిమా చాలా బాగుందని, ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తన మేనల్లుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్పెషల్ షోకు చిరంజీవితో పాటు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.


ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... ‘మామయ్య చిరంజీవి నిన్న రాత్రి సుప్రీం స్పెషల్ షో చూసి బాగా ఎంజాయ్ చేసారు, సినిమా పెద్ద హిట్ అవ్వాలని మూవీ టీంను ఆశీర్వదించారు. స్పెషల్ షోకు వచ్చిన మామయ్యకు థాంక్స్' అంటూ ట్వీట్ చేసారు.


సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘సుప్రీమ్' చిత్రాన్ని నిర్మించారు . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సుప్రీం ప్రీమియర్ షోకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...


సుప్రీం టీంను అభినందిస్తున్న చిరంజీవి

సుప్రీం టీంను అభినందిస్తున్న చిరంజీవి

సుప్రీం చిత్ర టీంను అభినందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి. చిత్రంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి తదితరులు.


దర్శకుడికి అభినందనలు

దర్శకుడికి అభినందనలు

సినిమా చాలా బాగా తీసావ్ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందిస్తున్న చిరంజీవి.


అల్లరి

అల్లరి

స్పెషల్ షో సందర్బంగా సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, శ్రీనివాస్ రెడ్డి అల్లరి.


సాయి ధరమ్ తేజ్ పేరెంట్స్

సాయి ధరమ్ తేజ్ పేరెంట్స్

ఈ ప్రీమియర్ షోకు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.


చిరంజీవి

చిరంజీవి

60 ఏళ్ల వయసులోనూ చిరంజీవి లుక్ అదిరిపోయేలా ఉంది కదూ...


సాయి కార్తీక్

సాయి కార్తీక్

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ను అభినందిస్తున్న చిరంజీవి.
English summary
Megastar Chiranjeevi Watches Supreme Premier Show at Prasad labs.
Please Wait while comments are loading...