Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
చిరంజీవి చేతుల మీదుగా 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్' టీజర్
తమ తమ సినిమాల్లో బిజీగా ఉంటూనే ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ సహకార ధోరణిలో వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాను ప్రజల్లోకి తీసుకు రావడంలో ఒకరికి ఒకరు తోడవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్' సినిమా టీజర్ లాంచ్ చేసేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.
క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయబోతున్నారు.
క్రికెట్ నేపథ్యంలో ఒక మంచి కంటెంట్ మూవీగా కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్రంలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్, 'రంగస్థలం' మహేశ్, విష్ణు(టాక్సీవాలా ఫేమ్), రవిప్రకాశ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్, కథ: అరుణ్రాజా కామరాజ్, మాటలు: హనుమాన్ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్(కెకె), కాసర్ల శ్యామ్, రాంబాబు గోసల, అందిస్తున్నారు.