twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి చేతుల మీదుగా 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌' టీజర్

    |

    తమ తమ సినిమాల్లో బిజీగా ఉంటూనే ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ సహకార ధోరణిలో వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాను ప్రజల్లోకి తీసుకు రావడంలో ఒకరికి ఒకరు తోడవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌' సినిమా టీజర్ లాంచ్ చేసేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.

    క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయబోతున్నారు.

    Chiranjeevi will launch will launch the teaser of kousalya krishnamurthy

    క్రికెట్ నేపథ్యంలో ఒక మంచి కంటెంట్‌ మూవీగా కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్రంలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజా కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, అందిస్తున్నారు.

    English summary
    Different storyline movie Kousalya Krishnamurthy which is directed by Bhimaneni Srinivasa Rao. This movie teaser will launch by Megastar Chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X