twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'పంజా'పై చిరంజీవి కామెంట్

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా గురించి చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఆయన తన సోదరుడు పవన్ కి గుడ్ లక్ చెప్తూ..ఈ చిత్రం ట్రైలర్స్ చూసాను చాలా స్టైలిష్ గా బాగున్నాయి. ఇప్పటివరకూ నేనూ ఇంకా సినిమా చూడలేదు..కానీ సినిమా చాలా స్టైలిష్ గా తెరకెక్కిందని విన్నాను. పవన్ ఎప్పుడూ లేనంతగా ఈ సినిమాలో కనపడుతున్నాడు అన్నారు. ఇక పంజా చిత్రం ఈ నెల తొమ్మిదిన విడుదల అవుతోంది. ఇక ఈ మధ్యన పవన్ కీ, చిరంజీవి కి చెడిందన్న నేపధ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధ్యాన్యత లభించింది. పంజా ఆడియోకి చిరు గానీ,ఆయన కుటుంబం కానీ రాకపోవటం మీడియాలో అప్పుడు చర్చనీయాంసమైంది. చిరంజీవి కాంగ్రేస్ తో కలవటం ఇష్టం లేని పవన్ కల్యాణ్ ఆయనతో సరిగ్గా ఉండటం లేదని, దాంతో ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని,అందుకే చిరంజీవి రాలేదని ఊహాగానాలు మీడియాలో వచ్చాయి.

    ఆ తర్వాత నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ విడి విడిగా వచ్చి తమ కుటుంబంలో ఏమీ లేవని చెప్పినా ఎవరూ నమ్మలేదు. అయితే చిరంజీవి అప్పుడేమీ నోరు విప్పలేదు. ఇన్ని రోజులు తర్వాత పంజా చిత్రం విజయవంతం అవ్వాలని ఆశిస్తూ ఆయన మీడియా ముందు తన సోదురుడుపై ప్రేమను బహిర్గతం చేసారు. ఇక పంజా చిత్రంని ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్దన్ తెరకెక్కించారు. గతంలో విష్ణువర్దన్ డైరక్ట్ చేసిన భిళ్లా చిత్రం స్టైలిష్ ఎంటర్టైనర్ అని పేరు తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రం కూడా హిట్టవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు హిట్టై, చిత్రంపై మంచి క్రేజ్ ని క్రియేట్ చేసాయి.

    English summary
    Chiru wishes his brother Pawan Kalyan good luck for his upcoming release Panja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X