తమ్ముడికి చిరంజీవి శుభాకాంక్షలు... అందుకే కళ్యాణ్ బాబును కలవలేదట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అటు అభిమానులు, ఇటు సినీ స్టార్లు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఏకంగా పారాచూట్ జంప్ చేసి బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇక మెగస్టార్ చిరంజీవి తమ్ముడిని స్వయంగా కలిసి విష్ చేస్తారని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు.

తాజాగా చిరంజీవి తమ్ముడిని విష్ చేయడంతో పాటు తాను ఎందుకు కలవలేదో వివరించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ అందుబాటోలు లేక పోవడం వల్లనే అతడిని కలవాలనే తన ప్రయత్నం విరించుకున్నారట. ఈ మేరకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అఫీషియల్ పేజీ ద్వారా చిరంజీవి ఓ పోస్టు పెట్టారు.
కళ్యాణ్ బాబు !!!!
నువ్వు అందుబాటులో లేవని తెలిసింది , కలవాలని అనుకొని విరమించాను .
🎉🌹🌺🌻🍰పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🌷🌸🌼
ఆ హనుమాన్ , నీకు మానసిక స్థైర్యాన్ని , ధైర్యాన్ని , ఆరోగ్యాన్ని మరియు మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను .
ఆశీస్సులతో
అన్నయ్య
చిరంజీవి
''నువ్వు అందుబాటులో లేవని తెలిసింది, కలవాలని అనుకొని విరమించాను''.... అని మెగాస్టార్ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. తాను కలవక పోవడం వల్ల సోషల్ మీడియాలో జరిగే అనవసర ప్రచారానికి తావు ఇవ్వ కూడదనే చిరంజీవి ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications