శతమానం భవతి అంటూ రానాకు చిరంజీవి దీవెన.. మిహికా క్రేజీ రియాక్షన్!

బాహుబలిలో భల్లాళదేవగా ప్రపంచ సినీ అభిమానులను ఆకట్టుకొన్న రానా దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రానా తన ప్రేయసి పేరును సోషల్ మీడియా ద్వారా పరిచయం చేయడంతో అభిమానులు, సన్నిహితులు సంతోషంలో మునిగిపోయారు. రానా ట్వీట్ చేసిన వెంటనే సినీ ప్రముఖులు, సన్నిహితులు అభినందనలతో మోత మోగించారు. రానాకు అభినందనలు తెలిపిన వారిలో

చిరంజీవి ట్వీట్‌తో దీవెనలు

చిరంజీవి ట్వీట్‌తో దీవెనలు

నా ప్రేమను అంగీకరించింది అంటూ ప్రేయసి మిహికా బజాజ్ ఫోటో పెట్టి రానా చేసిన ట్వీట్‌పై చిరంజీవి స్పందిస్తూ.. కంగ్రాట్స్ మై బాయ్ రానా దగ్గుబాటి. ఎట్టకేలకూ భల్లాళ దేవుడు అందమైన అమ్మాయి చిక్కిపోయాడు. లాక్‌డౌన్ పెళ్లికి దారి తీసింది. భగవంతుడు మీ ఇద్దరిని చల్లగా చూడాలి. శతమానం భవతి అంటూ మిహికా బజాజ్‌ను ట్యాగ్ చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.

తమన్నా భాటియా శుభాకాంక్షలు

తమన్నా భాటియా శుభాకాంక్షలు

పెళ్లి చేసుకోబోతున్నానంటూ రానా చేసిన ట్వీట్‌పై తమన్నా భాటియా స్పందిస్తూ.. కంగ్రాట్స్ రానా, మిహికా. కాలం గడిచిన కొద్ది మీ ప్రేమ కూడా అలాగే పెరుగుతూనే ఉండాలి అని కోరుకొంటున్నాను అని అన్నారు. తమన్నా, రానా కలిసి బాహుబలి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది.

చిరంజీవి మెసేజ్ రీట్వీట్

చిరంజీవి మెసేజ్ రీట్వీట్

చిరంజీవి అందించిన దీవెనలపై మిహికా స్పందిస్తూ.. థ్యాంక్యూ సర్ అని ట్వీట్ చేసింది. చిరంజీవి పెట్టిన ట్విట్‌ను రీట్వీట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకొన్నది. అలాగే రానా కూడా చిరంజీవి ట్వీట్‌కు థ్యాంక్యూ సర్ అంటూ కామెంట్ పెడుతూ.. ఈ ఫోటో చాలా బాగుంది అంటూ స్పందించారు. ఆ తర్వాత రానాతో కలిసి తన డ్యూ డిజైనర్ ఆఫీస్‌లో ఉన్న ఫోటోను ట్విట్టర్‌, ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.

రానాకు మిహికా బజాజ్ అమేజింగ్ రిప్లై

రానాకు మిహికా బజాజ్ అమేజింగ్ రిప్లై

రానా తన ప్రేయసి గురించి పరిచయం చేస్తూ పెట్టిన ట్వీట్‌కు మిహికా బజాజ్ కూడా స్పందించారు. కళ్లలో మెరుపులు అనే విధంగా ఇమోజీని పెట్టి రిప్లై ఇచ్చింది. కాగా రానా ట్వీట్ చేయగానే మిహికా ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌లో అకౌంట్లు తెరిచారు. అంతేకాకుండా లెక్కలేనని ఫ్యాన్ అకౌంట్లు కూడా మిహికా పేరున ట్విట్టర్‌లో కనిపించడం గమనార్హం.

Recommended Video

Happy Birthday Sai Pallavi : Sai Pallavi Film Career Interesting Facts
సినీ ప్రముఖుల ట్వీట్స్

సినీ ప్రముఖుల ట్వీట్స్

ఇంకా రానాకు శుభాక్షాంక్షలు తెలిపిన సినీ ప్రముఖుల్లో రాంచరణ్, హన్సిక మోత్వాని, కృతి ఖర్బందా, అనిల్ కపూర్, శ్రీయా సరన్, ఉపాసన కొణిదెల, సుశాంత్, నిహారిక కొణిదెల, అల్లు శిరీష్, కార్తికేయ గుమ్మంకొండ తదితరులు ఉన్నారు. యో డియర్.. మీ ఇద్దరికి సూపర్ డూపర్ మ్యూజికల్ కంగ్రాట్స్ అంటూ దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X