twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గురుతుల్యులు, పితృసమానులు.. కళాతపస్వీ పుట్టినరోజుపై చిరు ఎమోషనల్

    |

    కళా తపస్వి కే విశ్వనాథ్ పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 19). ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ అందజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా విషెస్ అందజేశాడు. తన గురువు మీదున్న ప్రేమను వ్యక్తపరుస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. మరో వైపు మెగా బ్రదర్ నాగబాబు కూడా తనదైన శైలిలో పోస్ట్ చేస్తూ విషెస్ అందజేశాడు.

    మెగా అభిమానం..

    మెగా అభిమానం..

    కళాతపస్వి కే విశ్వనాథ్ అంటే చిరంజీవికి గౌరవం, ఇష్టం, ప్రేమ. ఆయన్ను కేవలం దర్శకుడిగా మాత్రమే చూడకుండా కుటుంబ సభ్యుడిగా, పెద్దగా భావిస్తుంటాడు చిరంజీవి. ప్రతీ బర్త్ డే, ప్రత్యేక సందర్భాల్లోనూ ఇంటికి వెళ్లి మరీ అభినందనలు చెబుతుంటాడు.

    పద్మ అవార్డు సందర్భంగా..

    పద్మ అవార్డు సందర్భంగా..

    కళాతపస్వికి పద్మ అవార్డు వరించిన సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించాడు. ఇంటికి వెళ్లి మరీ పాదాభివందనం చేశాడు చిరంజీవి. పండుగ సందర్బంగానూ చిరంజీవి తన సతీమణితో సహా గురువు దగ్గరికి వెళ్లి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. తాజాగా ఇలా తన మార్గదర్శకుడికి బర్త్ డే విషెస్‌ను చెప్పాడు..

    ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం..

    ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం..

    గురుతుల్యులు, పితృసమానులు,మహోన్నత దర్శకులు,తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంచేసిన కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం,తెలుగు వారికి చిరస్మరణీయం.ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవి ట్వీట్ వేశాడు.

    నాగబాబు అలా..

    నాగబాబు అలా..

    పద్మశ్రీ. కె. విశ్వనాథ్ గారెప్పుడూ ఆరోగ్యం సంతోషంగా ఉండాలి.. తన సినిమాల్లో సమకాలీన అంశాలను చూపిస్తూ సమాజాన్ని ప్రశ్నించేలా చేశారు.. మీకంటే బాగా ఎవ్వరూ తీయలేరు సర్ అంటూ నాగబాబు ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు హ్యాపీ బర్త్ డే చెబుతూ కళాతపస్వీ గొప్పదనాన్ని వివరించాడు నాగబాబు.

     చిరుతో రెండు..

    చిరుతో రెండు..

    మెగాస్టార్ చిరంజీవి కళాతపస్వి కాంబోలో రెండు అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. స్వయంకృషి, ఆపద్భాంధవుడు సినిమాల్లో కలిసి పని చేశాయి. అవి రెండూ కూడా చిరంజీవిని నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కించాయి.

    English summary
    Chiranjeevi Wishes to K Viswanath On His Birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X