నీ సమకాలీకుడిని కావడం గర్వకారణం.. చిరంజీవి ట్వీట్ వైరల్
తెలుగు చిత్రసీమకు చిరంజీవి ఎలాంటి వారో.. మళయాల సినీ పరిశ్రమకు మోహన్ లాల్ అలాంటి వారే. వీరిద్దరి మధ్య ఎన్నో యేళ్ల అనుబంధం ఉంది. వీరి సినీ ప్రయాణం, ఎదుగుదల అంతా ఒకే కాలపరిమితిలో జరిగింది. 1980 నాటి హీరో, హీరోయిన్లంతా ఒక గ్రూప్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆ కాలంలోని దక్షిణ భారత హీరో హీరోయిన్లు ఇప్పటికీ అంతే స్నేహభావంతో కలిసి ఉంటారు. అందుకు ప్రతీకగా ప్రతీ ఏడాది ఒకే చోట కలుస్తుంటారు. గతేడాది ఈ వేడుక చిరంజీవి ఇంట్లో జరిగిందని అందరికీ తెలిసిందే.
ఈ వేడుకలో కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌లకు చెందిన స్టార్స్ అందరూ చిరంజీవి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఆ వేడుకల్లో బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అందులో మోహన్ లాల్ రామ్ చరణ్, మోహన్ లాల్ చిరంజీవి కలిసి దిగిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేశాయి. తాజాగా చిరు చేసిన ట్వీట్‌తో వారి బంధం ఎంత గట్టిదో మరోసారి రుజువైంది.

నేడు మోహన్ లాల్ 60వ పుట్టినరోజు. ఈ మేరకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నుంచి కూడా శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి చేసిన ట్వీట్ తెగ హల్చల్ చేస్తోంది. 'నా ప్రియమైన మోహన్‌లాల్‌కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీలాంటి విలక్షణ నటుడు, లెజెండ్ యాక్టర్ సూపర్ స్టార్ సమకాలీకుడిని అయినందుకు నేనోంతో గర్వ పడుతున్నాను. ఈ నట ప్రపంచంలో ఇంకా స్పూర్తిని నింపుతూ.. మరింత అత్యున్నత స్థానంలోకి తీసుకెళ్లాలి. ప్రేక్షకులను ఇంకా ఇంకా ఆనందింపజేయాలి.. హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్'అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











