రానాకు పెద్ద హిట్ కావాలి.. విరాటపర్వం దర్శకుడిపై మెగాస్టార్ ప్రశంసల వర్షం
టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన విరాటపర్వం సినిమా టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి రానా, వేణు ఊడుగుల, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి హాజరయ్యారు. చిరంజీవి తన నివాసంలో విరాటపర్వం టీజర్‌ను వీక్షించారు. అనంతరం టీజర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్ మాట్లాడుతూ..

గొప్ప అభిరుచితో విరాటపర్వం
విరాట పర్వం టీజర్ చూసి తర్వాత ఆవిష్కరించాను. అందులో మా రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించారు. ఇంకా ఇందులో పేరున్న నటీనటులు నటించారు. గొప్ప అభిరుచితో ఈ సినిమాను రూపొందించిన సుధాకర్, శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అని చిరంజీవి అన్నారు.

వేణు ఊడుగలకు ప్రత్యేకంగా అభినందన
విరాటపర్వం చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శకుడు వేణు ఊడుగులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమాకు చక్కని సంగీతం అందించిన సురేష్ బొబ్బిలిని అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాకు పనిచేసిన టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.

వేణు ఊడుగులను చూస్తే టీ కృష్ణ గుర్తుకు వచ్చాడంటూ
విరాట పర్వం టీజర్ చూసిన తర్వాత వేణు ఊడుగుల పనితనం ఏమిటో స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు సమాజంలోని సమస్యలను తన చిత్రాల ద్వారా చెప్పే కమిటెడ్ దర్శకుడు టీ కృష్ణ గుర్తుకు వచ్చారు. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన మంచి చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. సమకాలీన పరిస్థితుల్లో అలాంటి చిత్రాలు రూపొందించి వేణు ఊడుగుల మంచి పేరు తెచ్చుకోవాలి అని చిరంజీవి విషెస్ అందజేశారు.

అద్భుతమైన నటీమణులతో
విరాటపర్వంలో సాయిపల్లవి, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహెబ్ లాంటి అద్భుతమైన యాక్టర్లు నటించారు. విరాట పర్వం సినిమా రానాకు పెద్ద హిట్ కావాలని విషెస్ అందజేస్తాను. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికి విజయం లభించాలని ఆశిస్తున్నాను అని చిరంజీవి అన్నారు.
Recommended Video

తెర ముందు, తెర వెనుక
నటీనటులు: రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ తదితరులు
రచన, దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: డీ సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి: డాని సంచెజ్ లోపేజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2021-04-30


Click it and Unblock the Notifications











