»   » కోడలు ఉపాసన, కూతుళ్లతో చిరంజీవి (లుక్ అదిరింది)

కోడలు ఉపాసన, కూతుళ్లతో చిరంజీవి (లుక్ అదిరింది)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి కోడలు ఉపాసన ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. తన ఇద్దరు కూతుర్లు సుస్మితా, శ్రీజ, కోడలు ఉపాసనతో కలిసి ఉన్న చిరంజీవి.... లుక్ పరంగా అదరగొట్టారు.

󾌰󾌸

Posted by Upasna Kamineni on Wednesday, February 10, 2016

చిరంజీవి 150..
వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రానికి రీమేక్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్. ఇటీవల వినాయక్ మీడియాతో మాట్లాడుతూ మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా తొలి షెడ్యూల్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

అంతా అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లొ తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా చిరంజీవితో చేస్తున్ తెలుగు వెర్షన్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. ఆమె అయితేనే చిరంజీవికి పర్ ఫెక్టుగా సెట్టవుతుందని భావిస్తున్నారట. ఫ్యాన్స్ కూడా నయనతార ఎంపికపై సంతృప్తిగానే ఉన్నారు.

English summary
Megastar Chiranjeevi with Daughter-in-law Upasana and his Daughters Srija, Sushmitha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu