twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తారా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి తన మాట కాదనడు అనే నమ్మకం వ్యక్తం చేసారు దర్శక రత్న దాసరి నారాయణరావు. వినడానికి కాస్త వింతగా ఉంది కదూ! వింత అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే గత కొంత కాలంగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. పైగా దాసరి చేసే పనులు చిరంజీవి వర్గానికి కాస్త కోపం తెప్పించేవిగా ఉండటమే అందుకు కారణం.

    అందుకు తాజా ఉదాహరణ చిరంజీవితో పాటు ఆయన వర్గానికి చెందిన పలువురు భాగస్థులుగా ఉన్న 'మాటీవీ'పై పోరు బాట పట్టారు దర్శకరత్న దాసరి. డబ్బింగ్ సీరియల్స్‌కు వ్యతిరేకంగా తెలుగు టీవీ ఆర్టిస్టులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు.

    ఈ విషయమై దాసరి నారాయణరావు మాట్లాడుతూ 'చిరంజీవి నాకెంతో గౌరవం ఇస్తారు. నేను ఏదైనా అడిగితే కాదనరు. ఆయన చానల్(మాటీవీ)లో డబ్బింగ్ సీరియళ్లను ప్రసారం చేయడం ఆపాలని నేను కోరుతాను' అని దాసరి వ్యాఖ్యానించారు. మరి దాసరి వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తారా?, కనీసం పట్టించుకుంటారా?

    దాసరి పోరాటంలో న్యాయముందని, కళాకారుడిగా ఇంత ఎత్తుకు ఎదిగిన చిరంజీవి.... తెలుగు టీవీ కళాకారులు చేస్తున్న ఆందోళనను కనీసం పట్టించుకోవడం లేదని, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న ఆయనకు ఇది తగదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

    English summary
    “Chiranjeevi respects me. He won't say no to me. I will ask him to stop telecasting dubbed TV serials on his channel (MAA TV)” Dasari Narayana Rao told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X