పులుల కోసం యుద్ధభూమిలో ఉండిపోయిన అభిమాని.. ఎమోషనల్ అవుతూ చిరంజీవి స్పెషల్ నోట్!

మెగా స్టార్ చిరంజీవికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది చిరంజీవి అభిమానులు తమకు తోచిన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే చిరంజీవి పలు సందర్భాల్లో తన అభిమానులు చేసిన మంచి పనుల విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు అలాగే వారిని తదనుగుణంగా అభినందిస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి అభిమాని చేసిన ఒక పని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా అభిమానిని అభినందించారు. ఆ వివరాల్లోకి వెళితే

చదువు కోసం

చదువు కోసం

ఉక్రెయిన్ అనే దేశం మీద రష్యా దండెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజుల నుంచి మీద రష్యా యుద్ధ ట్యాంకులు యుద్ధ విమానాలతో విరుచుకు పడుతుంది. అయితే రష్యాతో పోలిస్తే చిన్న దేశమే అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ దేశాన్ని తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ఉక్రెయిన్. అయితే అనేక మంది భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. భారత దేశంతో పోలిస్తే చైనా ఉక్రెయిన్ లాంటి కొన్ని దేశాల్లో వైద్య విద్య చాలా తక్కువ ఖర్చుతో అయిపోతున్న కారణంగా చాలా మంది ఆయా దేశాల్లో చదువు కోసం వెళుతున్నారు.

తమ వెన్నంటే

తమ వెన్నంటే

యుద్ధ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను, భారతీయ విద్యార్థులను భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ గంగా అనే పేరుతో ఎయిర్ లిఫ్ట్ చేసి వెనక్కి తీసుకుని వచ్చింది. అలా చేస్తున్న సమయంలో ఒకరిద్దరు తమ పెంపుడు జంతువులు లేకుండా వెనక్కి రాలేము అని చెబుతూ అక్కడే ఉండటానికి సిద్ధ పడటంతో ఆలోచనలో పడ్డ ప్రభుత్వం పెంపుడు జంతువులను కూడా వెనక్కి తీసుకు రావచ్చు అంటూ నిబంధనలను మార్చింది. దీంతో కొందరు విద్యార్థులు కుక్కలను, పిల్లులను తమ వెన్నంటే తీసుకున్నారు.

నిబంధనలు ఏమీ లేవు

నిబంధనలు ఏమీ లేవు

అయితే ఆంధ్రప్రదేశ్ లోని తణుకు పట్టణానికి చెందిన గిరి కుమార్ పాటిల్ అనే వ్యక్తిది ప్రత్యేకమైన కథ. ఆయన సుమారు 15 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లి అక్కడే డాక్టర్ పట్టా పుచ్చుకొని డాక్టర్ గా స్థిరపడ్డారు. అక్కడ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని. లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి పులితో స్నేహం చేసినట్లు తాను కూడా పులులతో స్నేహం చేయాలని అనుకున్నాడు. మనదేశంలో పులులను ఇళ్ళలో పెంచుకోవడం తప్పు కానీ ఉక్రెయిన్ లో ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు.

కథనాన్ని ప్రసారం చేయడంతో

ఈ నేపథ్యంలో ఆయన ఉక్రెయిన్ రాజధానిలో ఉన్న జూ పార్క్ లో 27 లక్షల రూపాయలు చెల్లించి ఒక జాగ్వార్ అలాగే ఒక పాంథర్ లను చిన్నపిల్లల సమయంలో కొనుగోలు చేసి వాటిని మచ్చిక చేసుకుని తనతో పాటు ఇంట్లో పెంచుకుంటున్నాడు. ఇప్పుడు యుద్ధం రావడంతో వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని తీసుకు రావాలంటే భారత ప్రభుత్వం ఒప్పుకోదు. వాటిని అక్కడే వదిలి రావాలి అంటే వాటికి ఆహారం పెట్టేది ఎవరు? మనుషులు యుద్ధంలో చనిపోతుంటే జంతువుల్ని ఎవరు పట్టించుకుంటారు? అయినా అపురూపంగా పెంచుకునే వాటిని అక్కడ యుద్ధంలో అలా వదిలి వచ్చేయడానికి మనసు ఒప్పని నేపథ్యంలో గిరి కుమార్ పాటిల్ అక్కడే ఉండి పోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం ఆయన స్నేహితుల ద్వారా తొలుత జాతీయ మీడియాకు తర్వాత తెలుగు మీడియాకు చేరింది. ఈ విషయం మీద బీబీసీ న్యూస్ ఛానల్ వారు తెలుగులో ఒక కథనాన్ని ప్రసారం చేయడంతో అది మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్ళింది.

సురక్షితంగా ఉండండి

సురక్షితంగా ఉండండి

తన అభిమాని తన సినిమా చూసి ఇలా ఇన్స్పైర్ కావడం మెగాస్టార్ చిరంజీవిని కదిలించింది. యాదగి చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. ప్రియమైన గిరి కుమార్, జాగ్వర్స్ - పాంథర్స్ పట్ల మీ ప్రేమ నా నుండి ప్రేరణ పొందారని తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ దురదృష్టకర యుద్ధ సమయంలో మీరు వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడం, వాటి సంరక్షణ కోసం ఉక్రెయిన్‌లో ఉండాలని అనుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. ఈ జీవుల పట్ల మీ ప్రేమ,కరుణ ప్రశంసనీయం. ఈ సమయంలో మీరు బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను యుద్ధం త్వరగా ముగిసి సాధారణ స్థితికి తిరిగి త్వరగా రావాలని కోరుకుంటున్నాను. అప్పటి వరకు దయచేసి సురక్షితంగా ఉండండి, మీ పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోండి. గాడ్ బ్లెస్ అంటూ చిరంజీవి సుదీర్ఘ నోట్ పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X