‘మెగా’ కుటుంబంలో తీవ్ర విషాదం.. నాగబాబు సంతాపం.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్..
తమను అభిమానించే ఫ్యాన్స్‌ను కుటుంబ సభ్యులుగా భావిస్తామంటూ పలు సందర్భాల్లో పలు వేదికలపై మెగా హీరోలు స్పష్టం చేస్తుంటారు. తమ అభిమానులకు ఎలాంటి కష్టాలు వచ్చినా వారి కోసం ముందుంటారు. కష్టాల్లో ఉన్న ఫ్యాన్స్‌ను పలు సందర్భాల్లో ఆదుకొన్న దాఖలాలు ఉన్నాయి. తాజాగా చిరంజీవిని అమితంగా ఇష్టపడే ప్రసాద్‌రెడ్డి మరణించడంపై మెగా హీరోలు సోషల్ మీడియా ద్వారా ఆవేదన చెందారు. ప్రసాద్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ..

చిరంజీవి రాష్ట్ర యువతలో కీలకంగా
చిరంజీవి నట జీవితం ఆరంభమైనప్పటి నుంచి పలువురు అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. అలాంటి వారిలో ప్రసాద్ రెడ్డి ఒకరు. ప్రసాద్ రెడ్డికి మెగా హీరోలు సముచితమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలను తన భుజాన వేసుకొని అద్భుతంగా నిర్వహించారు.

ప్రసాద రెడ్డి మరణంతో అభిమానులు
చిరంజీవి యువత అధ్యక్షుడిగా పనిచేసిన ప్రసాద్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీన ఆకస్మిక మరణం చెందడంతో సహచర అభిమానలు, మిత్రులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని, కుటుంబానికి మనస్థైర్యం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం పలికారు.

కుల, మతాలకు అతీతంగా అంటూ నాగబాబు
రాష్ట్ర చిరంజవి యువత మాజీ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి మరణంపై నాగబాబు ఎమోషనల్ అయ్యారు. ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి అన్నయ్య అభిమానిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. కుల, మత, వర్గ, వర్ణ ప్రాంత బేధాలు లేకుండా ముందుకు సాగిపోయారు అని ట్విట్టర్‌లో వెల్లడించారు.

తమ్ముడు లేరనే వార్తతో కలతకు గురై
ప్రసాద రెడ్డి గొప్పతనం గురించి నాగబాబు తెలియచేస్తూ.. మన కులం అభిమాన కులం మన మతం సేవా మతం అని నిస్వార్థంగా సేవలందించారు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన తమ్ముడు ప్రసాదరెడ్డి మరణంత తీవ్రంగా కలిచి వేసింది. వ్యక్తిగతంగా కూడా ప్రసాద్ ప్రతీ చిన్న విషయాన్ని నాతో పంచుకొనే వాడు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతని భార్య, పిల్లలకు మేము మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

సాయి ధరమ్ తేజ్ సంతాపం
ప్రసాద్ రెడ్డి ఆకస్మిక మరణంపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పందించారు. మెగా ఫ్యాన్స్‌కు ఓ మూలస్థంభం లాంటి వ్యక్తిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇలాంటి కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోబలాన్ని భగవంతుడు ప్రసాదించాలి. RIP ప్రసాదరెడ్డి గారు అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











