చిరు జీవితంపై పుస్తకం అవసరమా?..: అక్కినేని
తాజాగా చిరంజీవి సినీ ప్రస్థానంపై ఓపుస్తకం వెలువడింది. ప్రముఖ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు సంకలనం చేసిన 'చిరంజీవితం-సినీ ప్రస్థానం' అనే పుస్తకాన్ని పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించి తొలి కాపీని రామ్ చరణ్ కు అందించారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ చిరంజీవి స్వయం కృషితో ఎదిగారని కొనియాడారు. నటన, డాన్స్ ల విషయంలో తనదైన శైలి ప్రదర్శించి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారని ప్రశంసించారు. చిరంజీవి గురించి, ఆయన ఎదుగుదల గురించి అందరికీ తెలిసు. ఆయన గురించి పుస్తకం రాయాల్సిన అవసరం లేదు. అయితే ఇటువంటి పుస్తకాలు భవిష్యత్ తరాలకు ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యంతో రామారావు లాంటి వారు రాస్తుంటారని చమత్కరించారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ "ఆటో బయోగ్రఫీ రాయాలని నాన్న గారిని అడిగాను కానీ ఆయన ఇంట్రస్టు చూపలేదు. చాలా మంది జీవిత చరిత్ర రాస్తామని వచ్చినా ఆయన ఇంట్రస్టు చూపలేదు. మా కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి రామారావుగారు ఈ పుస్తకాన్ని సంకలనం చేయడం ఆనందంగా ఉంది. ఇందులో నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయ"ని చెప్పుకొచ్చారు. రామారావు సొంతంగా సంపాదించిన డబ్బుతో ఈ పుస్తకాన్ని వేయించారని, చాలా గ్రాండ్ గా రిలీజ్ చేద్దామని తాను చెప్పినా ఆయన ఒప్పుకోలేదని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












