twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ చిరు 150వ చిత్రం, నాగబాబు ప్రకటన

    By Bojja Kumar
    |

    చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు గత కొంతకాలంగా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది? మాస్ మసాలాతో ఎంటర్ టైన్మెంట్ ప్లేవర్‌తో కూడి ఉంటుందా? లేక పొలిటికల్ ప్లేవర్‌తో సందేశాత్మకంగా ఉంటుందా? దర్శకుడు ఎవరు? అనే సందేహాలు అభిమానులను వెంటాడుతున్నాయి.

    ఇదిలా ఉంటే చిరంజీవి నుంచి ఈ విషయమై క్లారిటీ మాత్రం రావడం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చిరంజీవి సినిమాలకు దూరం అనే సందేశం స్పష్టంగా ఇచ్చారు. అయితే ఆ రంగంపై ఆశ చంపుకోలేని చిరు 150వ సినిమా తప్పకుండా చేస్తానంటూ...ఊరిస్తూ ఊదర గొడుతూనే, రాజకీయాల్లో ఉన్న నాకు ఇకపై నటించడం వీలుకాదేమో.. అంటూ ట్విస్టులిస్తూ అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నారు.

    అయితే చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రం చిరంజీవి 150 సినిమా వస్తుందని గంటాపదంగా చెబుతున్నారు. ఆ సినిమా ఫుల్ జోష్ తో కూడిన మాస్ మసాలా ఎంటర్‌టైన్మెంట్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుందని గురువారం మీడియాకు స్పష్టం చేశారు. దీనికి రామ్ చరణ్ నిర్మాతగా ఉంటారని స్పష్టం చేశారు. నాగబాబు ప్రకటన అభిమానులను సంతోషానికి గురి చేస్తుంది.

    రాజకీయ సినిమాలో చివరకు కాంగ్రెస్ వాడిగా మారిన చిరంజీవికి సినిమాలో నటించేంత ఖాళీ దొరుకుతుందా? నాగబాబేమో మాస్ మసాలా అంటున్నారు...రాజకీయాల్లో ఉన్న చిరు సందేశాత్మక సినిమాలు కాకుండా మాస్ మాసాలా అంటూ హీరోయిన్లతో సరసాలాడితే విమర్శలు తప్పవు. మరి ఏం జరుగబోతోందో...కాలమే నిర్ణయించాలి.

    English summary
    Megastar Chiranjeevi 150th movie as a mass entertainer. Nagababu confirmed this news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X