»   » మెగాస్టార్ సినిమాకి మెగాపవర్ స్టారే మెగా ప్రొడ్యూసర్...!

మెగాస్టార్ సినిమాకి మెగాపవర్ స్టారే మెగా ప్రొడ్యూసర్...!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'త్వరలో సినిమా చేస్తా'నంటూ అమితాబ్ బచ్చన్ సమక్షంలో ఆమధ్య చిరంజీవి ప్రకటించినప్పటికీ, రామ్ చరణ్ తానే నిర్మాతనని ప్రకటించినా, 'అన్నయ్య సినిమాకి నేనే దర్శకుడ్ని"అంటూ వివి వినాయక్ చెప్పేసుకున్నా, పూరిజగన్నాథ్ తన సొంతబ్యానర్ లో చిరంజీవి నటించబోయే సినిమాని తెరకెక్కిస్తానన్నా ఇప్పటివరకు ఆయన చేస్తారన్న నమ్మకం మాత్రం ఎవరికీ కలగడం లేదు. ఎందుకంటే, ఆ తర్వాత మళ్లీ సినిమా గురించిన ప్రస్తావన వస్తే.. 'చూద్దాం...చేద్దాం' అన్న తరహాలోనే మాట్లాడుతూ వచ్చారు. కేంద్రంలో తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో వుండడం వల్లే సినిమా చేయడంపై ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. అయితే, ఇప్పుడిక మంత్రి పదవి రాదని తేలిపోవడంతో సినిమాకు రెడీ అవుతున్నారు.

  నిన్న తిరుపతి పర్యటనలో చిరంజీవి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు కూడా. తన 150 వ సినిమా త్వరలో ఉంటుందనీ, రామ్ చరణ్ తేజ్ దానికి నిర్మాతగా వ్యవహరిస్తాడనీ ఆయన చెప్పారు. సోదరుడు నాగబాబు కోరికపై మళ్లీ నటిస్తున్నానని చెప్పారాయన. ఆమధ్య చరణ్ తో 'ఆరెంజ్' సినిమా తీసి, బాగా అప్పుల్లో వున్న నాగబాబుకి ఆర్ధికంగా సహాయపడడానికి ఈ సినిమాను చరణ్ బ్యానర్ పై తీస్తున్నారని తెలుస్తోంది.

  అయితే ఇంతకీ తన 150వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ చిరంజీవి, వివి వినాయక్ కి ఇస్తారా? పూరి జగన్నాథ్ చేతుల్లో 150వ సినిమాని చిరంజీవి పెడ్తారా? వీరిద్దర్నీ కాదని ఇంకో డైరెక్టర్ ని చిరంజీవి తెరపైకి తెస్తారా...?ప్రస్తుతానికి ఇది సస్పెన్సే...అన్నట్టు సెప్టెంబర్ 2 నుంచి తిరుపతి లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పర్యటిస్తానని చిరంజీవి ప్రకటించడం కొసమెరుపు...

  English summary
  Megastar Chiranjeevi has officially announced that his son Ramcharan Tej will be producing his 150th movie which would go on sets soon. He was chief guest for 100 days function of jeeva starrer tamil dubbing movie ‘Rangam‘ held Yesterday at tirupati.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more