చిరు వస్తే మెగా ముఖ్యమంత్రే!!!
ఖైదీ సినిమా ఎంత హిట్ అయిందో చిరంజీవి పార్టీ పెడితే కూడా అంత హీట్ అవుతుందని విజయవాడ అభిమానులు అంటున్నారు. చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతమున్న కుళ్లు రాజకీయాలను కడిగేయాలని అంటున్నారు. చిరంజీవి మంచి చేస్తాడని తమకు అపార నమ్మకముందని వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు ఎక్కువని, కులపిచ్చి విపరీతమని అలా ఉండకుండా కులాలకతీతంగా చిరంజీవి రాజకీయపార్టీని స్థాపించాలని వారంటున్నారు. సినిమా రంగంలో మెగాస్టార్ అయిన చిరంజీవి రాజకీయాలలోకి వస్తే మెగా ముఖ్యమంత్రి అవుతారని అభిమానులు ఆవేశంగా చెప్పారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్న చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి సమాజాన్ని సన్మార్గంలో తీసుకువెళ్లాలని వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications











