హెచ్‌ఐవి పిల్లల మధ్య చిరు వేడుక
పుట్టినరోజు పండుగే అందరికీ.. కానీ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే.. అన్న సినీకవి గీతానికి నిలువెత్తు నిదర్శనంగా మెగాస్టార్ చిరంజీవి నిలుస్తారు. తన పుట్టినరోజు వేడుకను ఆయన ఆగస్టు 22 మంగళవారంనాడు హెచ్‌ఐవి బాధితులైన చిన్నారుల మధ్య జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ భవన్‌లో చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన హెచ్‌ఐవి బాధిత చిన్నారులను పలుకరించి కొద్ది సేపు వారితో గడిపారు. చిన్నారులు అందించిన గులాబీలను సాదరంగా అందుకుని ప్రతి ఒక్కరితో కలచాలనం చేశారు.
చేయని పాపానికి హెచ్‌ఐవితో బాధపడుతున్న ఆ చిన్నారుల కోసం ఛారిటబుల్ ట్రస్ట్ తరపున కొత్త కార్యక్రమాలను చిరంజీవి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
film hero south indian superstar megastar chiranjeevi birthday celebrations with hiv affected children


Click it and Unblock the Notifications