సేమ్ ఫోజు వైరల్ అయిన వేళ..... మెగాస్టార్, పవర్‌స్టార్ ఆ ఇద్దరిపై కాలు పెట్టి!
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి వైజాగ్‌లో ఆదివారం జరిగిన 'రంగస్థలం' ప్రీ రిలీజ్ వేడుక కోసం ప్రత్యేక విమానం బుక్ చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్లైట్‌లో వెళుతూ తన ఎదురుగా కూర్చున్న చెర్రీ మీద కాలు పెట్టి ఓ ఫోటోకు ఫోజు ఇచ్చారు మెగాస్టార్. అయితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే విధంగా తన కుమారుడు అకీరా నందన్ మీద కాలు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఈ మెగా ఫోజులు వైరల్ అయ్యాయి.

చిరంజీవి-రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ప్రత్యేక విమానంలో వెళుతున్న సందర్భంగా తన కుమారుడిపై కాలు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన దృశ్యం ఇక్కడ చూడొచ్చు.

పవన్ కళ్యాణ్-అకీరా నందన్
తన కుమారుడు అకీరా నందన్ మీద కాలు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పవర్ స్టార్.

ఈ ఫోటో కూడా
మెగా స్టార్, పవర్ స్టార్‌కు సంబంధించిన ఈ ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి.

సేమ్ ఫోజు
తన కుమారుడు రామ్ చరణ్‌తో కూడా సేమ్ తమ్ముడి పవన్ కళ్యాణ్ తరహాలోనే మెగాస్టార్ ఫోజు ఇవ్వడం అప్పట్లో ఇంటర్నెట్లో బాగా సర్క్యూలేట్ అయింది.


Click it and Unblock the Notifications











