ఆ విషయాల్లో చెర్రీకి కోచింగ్ ఇస్తున్న చిరు
మన తెలుగు పరిశ్రమనే తీసుకుంటే ఇక్కడ సినీ కుటుంబాల నుంచి వచ్చిన యువ హీరోల సక్సెస్ రేటే ఎక్కవు. తమ తాతలు, తండ్రులు చాలా కష్టపడి ఇండస్ట్రీలో పైకొచ్చారు. వారి అనుభవాలను రంగరించి తమ వారసులకు మెలకువలు చెబుతుండటంతో వాటిని తొందరగా క్యాచ్ చేస్తూ అతి త్వరగా ఓ రేంజ్ కు ఎదిగిపోతున్నారంతా. నందమూరి, అక్కినేని, కొనిదెల కుటుంబాల నుంచి వచ్చిన హీరోలు సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఇదే.
తాజాగా చిరంజీవి కుటుంబ నుంచి పరిశ్రమలో పైకి ఎదుగుతున్న హీరో రామ్ చరణ్. ఇప్పటికే ఓ మంచి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు చరణ్. అయితే తన మాదిరి నెం.1 స్థాయికి ఎదిగేలా చరణ్ కు స్పెషల్ కోచింగ్ క్లాసులు మొదలు పెట్టాడట చిరంజీవి. ఎలాంటి కథలను ఎంపిక చేసుకోవాలి, ఇండస్ట్రీలో ఉండే జిత్తుల మారి నక్కలను ఎలా ఎదుర్కొనాలి, పబ్లిక్ ఫంక్షన్ లలో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాడు. గతంలోనే చరణ్ కు ఇలాంటి క్లాసులు తీసుకున్నప్పటికీ, తాజాగా మరోసారి కొడుకు కోచింగ్ మొదలు పెట్టాడట చిరంజీవి. త్వరలో చరణ్ ఓ ఇంటి వాడు కాబోతున్న నేపథ్యంలో ఆ తర్వాత పరిశ్రమలో ఎలా మెలగాలి, హీరోయిన్లతో ఎలా వ్యవహరించాలి అనే దానిపై స్పెషల్ ట్రిక్స్ బోధిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











